బీజేపీకి భారీ బ్యాడ్ న్యూస్ చెప్పిన కేకే అంచనా... కంటిన్యూ అవుతుందంట!
అక్టోబర్ 5వ తేదీన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Sep 2024 3:51 AM GMTఅక్టోబర్ 5వ తేదీన హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. మరోపక్క సర్వేల సందడి మొదలైంది. ఈ క్రమంలో... తాజాగా కేకే సర్వే షాకింగ్ అంచనాలు వెల్లడించింది.
అవును... మరో రెండు వారాల్లో హర్యానాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కేకే సర్వే షాకింగ్ అంచనాలు తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా... హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదని అంచనా వేసింది. ఈ సందర్భంగా బీజేపీని మునిగిపోతున్న టైటానిక్ తో పోల్చడం గమనార్హం!
ఈ సందర్భంగా... హర్యానాలో బీజేపీకి తీవ్ర వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంచనా వేసిన కేకే సర్వే... ప్రతీ మూడు సీట్లలో రెండు సీట్లను బీజేపీ కోల్పోబోతుందని పేర్కొంది! ఈ సమయంలో బీజేపీ వ్యతిరేక ఓటు మొత్తం కాంగ్రెస్ కు ప్రయోజనం చేకురుస్తుందని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు చుస్తుందని తెలిపారు!!
ప్రధానంగా రైతులు, జాట్ కమ్యూనిటీలో బీజేపీపై గణనీయమైన వ్యతిరేకత ఉందని చెప్పిన కేకే సర్వే... ఆ పార్టీకి ప్రధాన ఓటర్లు విధేయులుగా ఉన్నప్పటికీ.. తటస్థ ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో 5 శాతం ఓట్ల వ్యత్యాసం సీట్ల సంఖ్యలో గణనీయమైన మార్పుకు దారితీయవచ్చని అంచనా వేసింది.
ఏది ఏమైనప్పటికీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వచ్చే తుది సీట్ల లెక్క అందరినీ షాక్ కి గురిచేస్తుందని కేకే సర్వే అంచనా వేసింది! అయితే ఇది ఇక్కడితో అయిపోలేదని... నెక్స్ట్ జరగబోయే మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ లలో కూడా పార్టీకి ఇదే గతి పడుతుందని కిరణ్ కొండేటి సర్వే జోస్యం చెప్పింది!