Begin typing your search above and press return to search.

హరియాణాలో కేకే సర్వే అంచనాలు టోటల్ రివర్స్..!

హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దాదాపు సర్వే సంస్థల అంచనాలు తారుమారయ్యాయనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   8 Oct 2024 2:17 PM GMT
హరియాణాలో కేకే సర్వే అంచనాలు టోటల్  రివర్స్..!
X

హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దాదాపు సర్వే సంస్థల అంచనాలు తారుమారయ్యాయనే చెప్పాలి. ప్రధానంగా హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి కచ్చితంగా వచ్చితీరుతుందని పక్కాగా చెప్పిన పలు సర్వేలు పూర్తిగా తారుమారయ్యాయి. ఈ సమయంలో కేకే సర్వే అంచనాలపై చర్చ మొదలైంది.

అవును... ఏపీలో సార్వత్రిక ఎన్నికలపై సంచలన సర్వే వెల్లడించారు కేకే! ఆయన చెప్పినట్లుగానే కూటమికి 160 పైచిలుకు సీట్లు వచ్చాయి. కేకే సర్వే నిజం కావడంతో ఆయన పేరు ఒక్కసారిగా మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో హరియాణా ఎన్నికలపై కూడా కేకే సర్వే నిర్వహించి ఫలితాలు వెల్లడించారు.

ఇందులో భాగంగా హరియాణాలో కాంగ్రెస్ కు 65కు పైగా స్థానాల్లో విజయం కన్ ఫాం అన్నట్లుగా.. అక్కడ బీజేపీ కనీసం పోటీ కూడా ఇవ్వలేదని.. బీజేపీ ఇక టైటానిక్ షిప్ లాంటిదని కేకే వ్యాఖ్యానించిన పరిస్థితి! ఇదే క్రమంలో.. హర్యానాలోని ప్రతీ మూడు నియోజకవర్గాల్లో రెండింట భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని కేకే చెప్పారు!

అయితే... కేకే ఒకటి తలిస్తే ప్రజానికం మరొకటి తలచిందన్నట్లుగా హర్యానాలో కేకే అంచనాలు తలకిందులయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో చేసిన సర్వేలు సక్సెస్ అయ్యాయని.. నార్త్ లో కూడా చెప్పినట్లుగానే ఫలితాలు వస్తాయన్నట్లుగా భావించిన చాలా మందికి బిగ్ షాక్ ఇస్తూ ఒరిజినల్ ఫలితాలు తెరపైకి వచ్చాయి.

ఫలితంగా... కేకే చెప్పినదానికంటే విభిన్న ఫలితాలు హరియాణాలో వచ్చాయి. ఈ మేరకు ఆ రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టిందనే చెప్పాలి. దీంతో... కొండేటి కిరణ్ అంచనాలు హర్యానాలో టోటల్ రివర్స్ అయ్యయని అంటున్నారు నెటిజన్లు. మరోపక్క మ్యాజిక్ ఫిగర్ దాటి ఆధిక్యంలో ఉండటంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.