'కేకే' మాస్టారు నేటి తరానికి ఏం చెబుతున్నారో?!
ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయ కుల్లో ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత.. లేదా.. సమానంగా అయినా.. కే. కేశవరావు నిలుస్తారు.
By: Tupaki Desk | 6 July 2024 1:30 AM GMTఒక నాయకుడు 30 ఏళ్ల పాటు రాజకీయాలు చేస్తే.. మూడు తరాలను చూసినట్టు లెక్క. సో.. సదరు నాయ కుడు కనీసంలో కనీసం ఒక్క తరానికైనా ఆదర్శం కావాలి. ఒక ఉద్యోగి 30 ఏళ్ళు ఒక విభాగంలో పనిచేస్తే.. ఆ విభాగానికే హెడ్డయినట్టు.. రాజకీయాల్లో ఉన్నవారు కూడా.. 'హెడ్' మాదిరిగా వ్యవహరించాలి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయ కుల్లో ఏపీ సీఎం చంద్రబాబు తర్వాత.. లేదా.. సమానంగా అయినా.. కే. కేశవరావు నిలుస్తారు.
ఈయనకు రాజకీయం వృత్తి కాదు. ఒకప్పటి స్కూల్ టీచర్ కేకే. పిల్లలకు ఎన్నో సూక్తులు, నీతులు బోధిం చి.. పేరు తెచ్చుకున్నారు కూడా. ఆ తర్వాత.. సమాజం పట్ల బాధ్యతాయుతమైన పాత్రికేయ రంగాన్ని ఎంచుకున్నారు. 'ది డైలీ' అనే ఇంగ్లీష్ పేపర్ సహా.. ఇతర తెలుగు పేపర్‌లోనూ ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు.. సమాజం పట్ల బాధ్యత కూడా ఆయనకు ఉంది. ఎమర్జెన్సీ సమయంలో కేకే.. ఆంగ్ల పత్రికలో పనిచేస్తున్నారు.
ఆయన రాసిన ఎడిటోరియల్, సహా వ్యాసాలను.. పరిశీలించి. ఏకంగా పత్రికను నిషేధించారంటే.. ఇందిర మ్మను అప్పట్లో ఎంత తిట్టి పోశారో.. అర్థమవుతుంది. అలాంటి కేకే.. తర్వాత కాలంలో అదే పార్టీలో చేరా రు. ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్‌గా చేసినప్పుడు.. కేకేపై ఆర్థికపరమైన ఆరోపణలు వచ్చాయి. పదవులు ఇప్పి స్తానని చెప్పి.. ఆయన నేతల నుంచి నిధులు భోం చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనికి తోడు.. కొందరు నేతలను అవమానించారంటూ.. పార్టీ అధిష్టానానికి కొందరు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ పరిణామాలతో ఉన్న పళాన కేకేను ఆ పదవి నుంచి తప్పించిన సోనియా.. ఎక్కడో ఉన్న పశ్చిమ బెంగా ల్ కు బదిలీ చేశారు. అక్కడ పార్టీకి పెద్దగా పనిలేదన్న విషయం తెలిసిందే. అంటే.. కేకేకు పనిష్మెంట్ అన్నమాట. ఆ తర్వాతే .. రాష్ట్ర విభజన చోటు చేసుకోవడం.. ఆయన నేరుగా పార్టీకి రాం రాం పలికి.. కేసీఆర్ చెంతకు చేరడం.. అనంతర కాలంలో రాజ్యసభ కు ఎన్నిక కావడం.. కేసీఆర్‌కు రైట్ హ్యాండ్‌గా ఉండడం కుమార్తె గద్వాల్ విజయలక్ష్మికి జీహెచ్ ఎంసీ మేయర్ పదవిని ఇప్పించుకోవడం అందరికీ తెలిసిందే.
కట్ చేస్తే..
సరే.. ఇప్పుడు ఇవన్నీఎందుకు? అంటున్నారా? ఎందుకంటే.. కేకేసర్.. ఆదర్శవంతమైన మాటలు మా ట్లాడారు. కాంగ్రెస్‌లోకి తిరిగి రావడం.. తనకు సొంత ఇంటికి వచ్చినట్టు ఉందని చెప్పారు. అంతేకాదు.. నేను కాంగ్రెస్ మనిషిని అని కూడా.. కేకే సర్ ఉవచించారు. కానీ.. ఈ మాటలన్నీ ట్రాష్ అని ఆయన రాజకీయ నడకే నిరూపిస్తోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. తనకు, తన కుటుంబానికి మేలు జరిగితే చాలనే రీతిలో కేకే వ్యవహార శైలి ఉంటుందని అంటున్నారు. ఇలాంటి నాయకుడు రాజకీయాల్లో ఆదర్శ నేత ఎలా అవుతారో.. ఆయనే చెప్పాలని అంటున్నారు.