Begin typing your search above and press return to search.

వైసీపీ మాస్ లీడర్ లుక్ మారింది.. గుర్తుపట్టలేనంతగా...?

ఈ క్రమంలో తాజాగా తిరుమల కొండపై కనిపించారు కొడాలి నాని. ఎప్పుడు ఒత్తైన జుట్టు, గుబురు గడ్డంతో కనిపించే కొడాలి నాని.. ఇప్పుడు నయా లుక్ లో కనిపించారు!

By:  Tupaki Desk   |   15 Oct 2024 1:36 PM GMT
వైసీపీ మాస్  లీడర్  లుక్  మారింది.. గుర్తుపట్టలేనంతగా...?
X

ఏపీలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఒకరు, గత ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కొడాలి నాని గురించి రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. (ఊర) మాస్ లీడర్ గా ఆయన ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు.

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 2004 నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కొడాలి నాని. ఈ క్రమంలో ఓసారి మంత్రిగానూ పనిచేశారు. ఇందులో 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన ఆయన 2014, 2019లో వైసీపీ నుంచి గెలుపొందారు. కారణాలు ఏవైనప్పటికీ 2024లో ఘోరంగా 53,040 ఓట్లతేడాతో ఓటమిపాలయ్యారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాల అనంతరం కొడాలి నాని ఇంటిపై దాడి జరగడం.. అనంతర పలు కేసులు రీఓపెన్ అయ్యాయనే కామెంట్లు వినిపించడం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్నారు కొడాలి నాని. దానికి ఆయన ఆరోగ్య సమస్యలే కారణమనే ప్రచారమూ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల పేర్ని నాని, వంశీతో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు.

తిరుమల లడ్డూ వ్యవహారం పీక్స్ కి చేరిన నేపథ్యంలో... మీడియా ముందుకు వచ్చిన ఆయన కల్తీ నెయ్యి ఆరోపణలపై విరుచుకుపడ్డారు. తర్వాత మళ్లీ పెద్దగా కనిపించింది లేదు. ఈ క్రమంలో తాజాగా తిరుమల కొండపై కనిపించారు కొడాలి నాని. ఎప్పుడు ఒత్తైన జుట్టు, గుబురు గడ్డంతో కనిపించే కొడాలి నాని.. ఇప్పుడు నయా లుక్ లో కనిపించారు!

తాజగా స్వామివారికి తలనీలాలు అర్పించడంతో గుండు, క్లీన్ షేవ్, మీసం లేకుండా కొడాలి నాని కొండపై కనిపించారు. ఇలా సడన్ గా కొండపై గుండుతో కొడాలిని చూసినవారు గుర్తుపట్టలేదని.. తర్వాత తేరుకుని క్లారిటీకి వచ్చారని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.