Begin typing your search above and press return to search.

మంత్రి పదవి ఎందుకు పోయిందో చెబుతున్న కొడాలి!

అవును... ప్రస్తుతం ఏపీ అధికారపార్టీలో జరుగుతున్న ఇంఛార్జ్ ల మార్పులు, చేర్పులు మొదలైన విషయాలపై తాజాగా వైసీపీ కీలక నేత కొడాలి నాని స్పందించారు.

By:  Tupaki Desk   |   13 Dec 2023 8:01 AM GMT
మంత్రి పదవి ఎందుకు పోయిందో చెబుతున్న కొడాలి!
X

ఏపీలో ఎన్నికల రాజకీయం మొదలైపోయింది. ఈ క్రమంలో అధికార వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగా... ఇప్పటికే సుమారు 11 మంది ఇన్ ఛార్జ్ లకు వైసీపీ అధిష్టాణం స్థాన చలనం కలిగించింది. ఈ సమయంలో వైసీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మరాయి. దీంతో తాజాగా ఈ విషయాలపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం ఏపీ అధికారపార్టీలో జరుగుతున్న ఇంఛార్జ్ ల మార్పులు, చేర్పులు మొదలైన విషయాలపై తాజాగా వైసీపీ కీలక నేత కొడాలి నాని స్పందించారు. ఇందులో భాగంగా... స్థాన చలనాలు, త్యాగాల అవసరాల వెనుక ఎన్నో రాజకీయ వ్యూహాలకంటే ముఖ్యంగా జగన్.. సమాజిక సాధికారత ఉందని, అదే సమాజానికి ముఖ్యమని, జగన్ కు అదే ప్రధానమని తెలిపారు.

ప్రధానంగా జనాభా దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు చేయాలని.. చట్టసభల్లో అన్ని సమాజికవర్గాలకూ ప్రాధాన్యత కల్పించాలనేదే జగన్ ధ్యేయం అని.. ఈ సమీకరణల్లో భాగంగానే తన మంత్రి పదవి పోవడం జరిగిందని.. అంతమాత్రాన్న తాను సరిగా పనిచేయడం లేదని కాదని కొడాలి క్లారిటీ ఇచ్చారు. సామాజిక, రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఓసీ అయిన తన మంత్రి పదవి తీసేసి, బీసీ అయిన జోగి రమేష్ కు ఇచ్చారని.. ఇది జగన్ బీసీలకు ఇచ్చే ప్రాధాన్యతలో భాగం అన్నట్లుగా కొడాలి స్పష్టం చేశారు.

ఇక తెలంగాణలో సిట్టింగులను కేసీఆర్ మార్చలేదు కాబట్టి ఓడిపోయారు.. అందువల్ల ఏపీలో జగన్ సిట్టింగులను మారుస్తున్నారనేది అర్ధం లేని ఆరోపణ, అవగాహన, విశ్లేషణ అని క్లారిటీ ఇచ్చిన కొడాలి... ఏపీలో ఉన్న పరిస్థితులు, లెక్కలు, సమీకరణలు వేరని అన్నారు. అలా పోల్చాలనుకుంటే... తాజాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలతోనూ పోల్చి చూస్తే క్లారిటీ వస్తుందని క్లారిటీ ఇచ్చారు.

ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు జనాభా దమాషా ప్రకారం సీట్లు ఇవ్వడం, రాజ్యాధికారంలో స్థానం కల్పించడమే జగన్ ఉద్దేశమని తెలిపిన ఆయన... జగన్ నిర్ణయం నూటికి 90 మందికి అంగీకరామే అని, 5 నుంచి 10 శాతం మందికి అంగీకారం కాని పక్షంలో బయటకు వెల్లడం సహజమని, దానివల్ల పార్టీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని చెబుతున్న కొడాలి నాని... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్ద పీట వేయాలన్నదే జగన్ కీలక నిర్ణయమని అన్నారు. దీంతో అధికార వైసీపీ అభ్యర్థులను మార్చుతున్నంత మాత్రన్న వారు పనికిరానివారు కాదనే ఆలోచన సరైంది కాదని.. రకరకాల సమీకరణల్లో భాగంగానే జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని, దానికి మెజారిటీ నాయకులు మద్దతు పలుకుతున్నారని కొడాలి క్లారిటీ ఇచ్చారు.