Begin typing your search above and press return to search.

కొడాలికి సెగ‌.. వ‌ద‌ల‌ని త‌మ్ముళ్లు!

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం పొందిన విష‌యం తెలిసిందే

By:  Tupaki Desk   |   16 Jun 2024 8:40 AM GMT
కొడాలికి సెగ‌.. వ‌ద‌ల‌ని త‌మ్ముళ్లు!
X

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ఎన్నికల్లో ఘోర ప‌రాజ‌యం పొందిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న కొంత కాలంగా ఎవ‌రికీ అందుబాటులోకి రావ‌డం లేదు. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న స‌మీక్షా స‌మావేశాల‌కు కూడా ఆయ‌న గైర్హాజ‌ర‌వుతున్నారు. ఇదిలావుంటే.. గ‌తంలో ఆయ‌న మంత్రిగా ఉన్న స‌మ‌యంలోనూ.. త‌ర్వాత కూడా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై నోరు పారేసుకున్న విష‌యం తెలిసిందే.

ముఖ్యంగా చంద్ర‌బాబును ఏక‌వ‌చ‌నంతో పిల‌వ‌డం.. వృద్ధుడ‌ని సంబోధించ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో నే ఈ ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మ‌రింత రెచ్చిపోయారు. చంద్ర‌బాబును ఆయ‌న సొంత నియోజ‌క‌వ ర్గంలోనే ఓడిస్తామ‌న్నారు. చంద్ర‌బాబు కు వ‌య‌సు అయిపోయింద‌ని.. వృద్ధాశ్ర‌మంలో చేరితే మంచిద‌ని కూడా అన్నారు. ఎంత మందితో పొత్తు పెట్టుకుని వ‌చ్చినా.. త‌మ‌కు ఒరిగేది లేద‌న్నారు. ఈ క్ర‌మంలోనే మ‌రింత దూకుడుగా శ‌ప‌థాలు కూడా చేశారు.

``కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళ దగ్గర పడుకుంటా`` అని కొడాలి నాని ఎన్నిక‌ల‌కు ముందు ఛాలెంజ్ చేశారు. అదేస‌మ‌యంలో తాను ఓడిపోతే.. రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని కూడా వ్యాఖ్యానించారు. పైగా ఇదేస‌మ‌యంలో టీడీపీపై నోరు చేసుకున్నారు. ఇప్పుడు ఆయ‌న ఓడిపోయిన నేప‌థ్యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు క్ష‌మించి వ‌దిలేసినా.. త‌మ్ముళ్లు మాత్రం విడిచి పెట్ట‌డం లేదు.

ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత‌.. గుడివాడ‌లోని నాని ఇంటిని తెలుగు యువ‌త నాయ‌కులు ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. దీనిని పోలీసులు అడ్డుకుని కేసులు కూడా పెట్టారు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీ యువ నాయ‌కులు మాత్రం కొడాలిని వ‌దిలి పెట్ట‌డం లేదు. తాజాగా ఆయ‌న శ‌ప‌థాల‌ను గుర్తు చేస్తూ.. గుడివాడ‌లో ఫ్లెక్సీల‌ను క‌ట్టారు. దీనిపై ఆయ‌న చేసిన శ‌ప‌థాన్నిరాసి .. గుర్తుచేశారు. అంతేకాదు.. ``పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి`` అంటూ.. స‌వాల్ రువ్వారు. మ‌రి ఈ ప‌రిణామం ఎటు దారి తీస్తుందో చూడాలి.