కొడాలి నానికి ఏమైంది? ఇప్పుడెలా ఉన్నారు?
పని ఒత్తిడి నుంచి అప్పుడప్పుడు కాస్తంత పక్కకు తప్పుకోవాలి. అందుకు భిన్నంగా పని మాత్రమే చేస్తూ.. విశ్రాంతి గురించి పట్టించుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం.
By: Tupaki Desk | 24 May 2024 5:02 AM GMTపని ఒత్తిడి నుంచి అప్పుడప్పుడు కాస్తంత పక్కకు తప్పుకోవాలి. అందుకు భిన్నంగా పని మాత్రమే చేస్తూ.. విశ్రాంతి గురించి పట్టించుకోకపోతే అనారోగ్యం బారిన పడటం ఖాయం. తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైంది మాజీ మంత్రి.. గుడివాడ ఎమ్మెల్యే కొడలి నాని అలియాస్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు. ఎన్నికలు ముగిసిన తర్వాత విహారయాత్రలకు కొందరు.. సొంత పనుల మీద మరికొందరు.. రాజకీయాలపై కాస్త తక్కువ ఫోకస్ చేసే నేతలకు భిన్నంగా అదే పనిగా పని చేస్తుంటారు కొడాలి.
గురువారం తన ఇంట్లో నియోజకవర్గం పరిధిలోని నందివాడ మండల పార్టీ నేతలతో భేటీ అయ్యారు. వారితో మాట్లాడుతున్న వేళలో.. ఉన్నట్లుండి ఒక్కసారిగా సోఫాలో ఒరిగిపోయారు. తీవ్రమైన పని ఒత్తిడి.. విశ్రాంతి లేని కారణంగా బీపీ డౌన్ అయి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వెంటనే.. వైద్యులను పిలిపించారు. ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కొడాలిని పరీక్షించిన వైద్యులు.. జ్వరం వచ్చి నీరసం కారణంగా అలా జరిగి ఉంటుందని పేర్కొన్నారు. తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచన చేశారు. కొడాలి నాని ఆరోగ్యంపై వాట్సాప్ లో పెద్ద ఎత్తున మెసేజ్ లు వైరల్ అయ్యాయి. తన ఆరోగ్య పరిస్థితిపై అపోహలు తలెత్తకుండా ఉండేందుకు కొడాలి నాని స్వయంగా వీడియో విడుదల చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. ఎలాంటి ఆందోళన అక్కర్లేదంటూ ఆయన విడుదల చేసిన వీడియోతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.