Begin typing your search above and press return to search.

కొడాని నాని.. 'న్యూ లుక్‌' అద్భుతః

రాజస్థాన్‌లో మిత్రుడు ఇంట జరుగుతున్న వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని సందడి చేశారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 10:58 AM GMT
కొడాని నాని.. న్యూ లుక్‌ అద్భుతః
X

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి కొడాలి నాని గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న నోరు విప్పితే విమ‌ర్శ‌ల వ‌ర్షం.. మాట‌ల తూటాలు.. కామ‌న్‌గా వ‌చ్చేస్తాయి. ఇక‌, పెద్ద‌గా ఆయ‌న హంగు ఆర్భాటాల జోలికి పోరు. రోడ్డు ప‌క్క‌న కూర్చుని స‌ర‌దాగా.. టీ తాగేస్తారు. ప‌కోడీలు, బ‌జ్జీలు కూడా.. తినేస్తారు. ప‌క్కా ఊర‌మాస్ లుక్‌లో క‌నిపిస్తారు. అయితే.. తాజాగా మాత్రం ఆయ‌న న్యూ లుక్‌లో క‌నిపించారు. నెటిజ‌న్ల‌తో అద్భుతః అనిపించుకుంటున్నారు.

రాజస్థాన్‌లో మిత్రుడు ఇంట జరుగుతున్న వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే కొడాలి నాని సందడి చేశారు. న్యూ లుక్ లో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే నాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాస్త‌వానికి ఏపీలో ఫైర్ బ్రాండ్ అయినా కొడాలి నాని రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అలాంటి ఆయన కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా రాజస్థాన్లో తన మిత్రుడి ఇంట జరుగుతున్న వివాహ వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతున్నారు.

వేడుకల్లో పాల్గొన్న ఆయన ఫోటోలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రతినిధులు సోషల్ మీడియాలో విడుదల చేశారు. న్యూ లుక్ తో ఉన్న కొడాలి నాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గుడివాడ పట్టణంలో ప్రముఖ వ్యాపారవేత్త అయిన కీర్తి కుమార్ జీవత్ ఇంట జరుగుతున్న వివాహ వేడుకలు రాజ‌స్థాన్‌లో జ‌రుగుతున్నాయి.

ఈ వేడుక‌కు ప్ర‌త్యేక ఆహ్వానితులుగా ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశి భూషణ్, పాలడుగు రాంప్రసాద్, ఎమ్మెల్యే అనుచరులు పాల్గొన్నారు. మొత్తానికి ఊర‌మాస్ ఇమేజ్ క‌న్నా ఈ న్యూలుక్ బాగుంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.