చంద్రబాబు బీజేపీ సంక నాకొచ్చు: కొడాలి నాని
చంద్రబాబు...బీజేపీ సంక నాకొచ్చు, మోడీ కాళ్లు పట్టుకోవచ్చు, అమిత్ షాది ఇంకేదో నాకోచ్చు అంటూ సంచలన కామెంట్లు చేశారు నాని.
By: Tupaki Desk | 4 Sep 2023 3:42 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు 118 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారని, ఆయనకు ఐటీ శాఖ నోటీసులు పంపిందని ఆంగ్ల పత్రికలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆ నోటీసులపై స్పందించాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, తాను నిప్పు అని, టీడీపీ నిజాయితీ గల పార్టీ అని చంద్రబాబు అంటున్నారు. ఇలాంటి నోటీసులు చాలా వచ్చాయని, అయినా తనను ఏమీ పీకలేరని ఆ ఐటీ నోటీసులనుద్దేశించి చంద్రబాబు పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో, వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు..ఇటువంటి స్టేలు ఎన్ని తెచ్చుకున్నా ప్రజా కోర్టులో ఆయనకు శిక్ష తప్పదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఐటీ శాఖ అధికారులను మేనేజ్ చేయడానికి చంద్రబాబు...బీజేపీ సంక నాకొచ్చు, మోడీ కాళ్లు పట్టుకోవచ్చు, అమిత్ షాది ఇంకేదో నాకోచ్చు అంటూ సంచలన కామెంట్లు చేశారు నాని. ఏం చేసినా రాష్ట్ర ప్రజల తీర్పు నుండి తప్పించుకోలేడని హితవు పలికారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని, ఆయనో 420, దొంగ అని దుయ్యబట్టారు. చట్టాలను అడ్డుపెట్టుకొని, వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రజాధనం దోచుకోవడం, దాచుకోవడం తెలిసిన వ్యక్తి అని సెటైర్లు వేశారు. చంద్రబాబు తనకున్న 2 ఎకరాలతోనే ఇప్పటివరకి బ్రతికాడా? అని నాని ప్రశ్నించారు.
2014లో ఓడినా 2019లో జగన్ సింగిల్ గానే ఎన్నికలో పోటీ చేశారని, కానీ, చంద్రబాబు మాత్రం బీజేపీని వాటేసుకొని కాంగ్రెస్ పార్టీతో కలుస్తానంటాడని ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, వైఎస్ రాజారెడ్డికి కొత్తగా డబ్బులు వచ్చాయా? తిరుపతి బస్టాప్ లో ఖర్జూర పండ్లు ఏమైనా అమ్మారా? అని చంద్రబాబుకు చురకలంటించారు. చంద్రబాబుకి సింగపూర్ లో హోటల్స్ ఎలా వచ్చాయని, ఎన్నికలకు రూ.5 వేల కోట్లు ఎలా ఖర్చు పెడతానని అంటున్నాడని నిలదీశారు. చంద్రబాబు అవినీతిపరుడు కాదని ఎక్కడా క్లీన్ చీట్ లేదని చెప్పారు.