Begin typing your search above and press return to search.

కొడాలి నాని టార్గెట్ గా ?

అదే ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి వంశీకి నేస్తం అయిన కొడాలి నాని పేరు ముందుకు వస్తోంది. కొడాలి నాని కూడా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Aug 2024 3:52 AM GMT
కొడాలి నాని టార్గెట్ గా ?
X

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్లలో తాము రాజకీయంగా ఎంతలా ఇబ్బంది పడింది గుర్తుకు తెచ్చుకుంటోంది. తమను వేధించిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని కూటమి పెద్దలు చెబుతున్నారు కూడా. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో 71వ నిందితుడిగా చూపించారు.

ఆయనను అరెస్ట్ చేయాలని కూటమి విశ్వ ప్రయత్నం చేసింది. అయితే ఆయన విదేశాలకు వెళ్లారని ప్రచారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి ముందే వంశీ దేశం విడిచారు అని కూడా ప్రచారం సాగుతోంది. దాంతో గత కొన్ని రోజులుగా మీడియాలో వేడి పుట్టించిన వల్లభనేని వంశీ అరెస్ట్ వ్యవహారం ఇపుడు కొంత పక్కకు వెళ్ళింది.

ఆయన కోసం వేట సాగుతూనే ఉంది. వంశీ విదేశాలకు వెళ్తే ఏమో కానీ దేశంలో ఉంటే కనుక అరెస్ట్ చేసి తీసుకుని రావడానికి కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇపుడు వంశీ తరువాత ఎవరు అన్నది బిగ్ క్వశ్చన్. దానికి బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సింది ఏమీ లేదని అంటున్నారు.

అదే ఉమ్మడి క్రిష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి వంశీకి నేస్తం అయిన కొడాలి నాని పేరు ముందుకు వస్తోంది. కొడాలి నాని కూడా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది అని అంటున్నారు. కొడాలి నాని టార్గెట్ ఎందుకు అంటే ఆయన వైసీపీ ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల పాటు టీడీపీ అగ్ర నాయకత్వం మీదనే గురి పెట్టి మరీ మీడియా ముందుకు వచ్చి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబుని లోకేష్ ని అసలు విడిచిపెట్టి వారు కాదు.

ఆయన దూకుడు ఒక్కో దశలో వ్యక్తిగత దూషణలకు కూడా దారి తీసేలా సాగేది. నేను ఇలాగే మాట్లాడుతాను అని ఆయన భావిస్తూ టీడీపీ పెద్దల మీద ఘాటు వ్యాఖ్యలే చేసేవారు. దాంతో టీడీపీ అధినాయకత్వంతో పాటు ఆ పార్టీ క్యాడర్ కూడా నాని మీద మండిపోతూ వచ్చింది. గుడివాడలో నాని ఓటమికి ఆయన నోటి దురుసు వ్యాఖ్యలు కూడా కారణం అని అంటారు.

గుడివాడలో నాలుగుసార్లు వరసబెట్టి గెలిచిన నానికి ఎదురు లేని పరిస్థితి ఉండేది. కానీ ఆయనను ఈసారి ఓడించేశారు. దాంతో ఆ షాక్ నుంచి తేరుకోవడం కొడాలికి చాలా కష్టమైంది. వెనిగండ్ల రాము అనే ఆయన చేతిలో నాని తొలిసారి ఓటమి చవి చూసారు.

ఓటమి తరువాత నాని మాట పలుకూ ఏదీ లేకుండా పోయింది. ఆయన ఎక్కువ కాలం హైదరాబాద్ లోనే గడుపుతున్నారు అని అంటున్నారు. ఆయన గురించిన సమాచారం అతి ముఖ్య అనుచరులకే తప్ప ఎవరికీ తెలియదు అని అంటున్నారు. గుడివాడలో పార్టీ విషయాన్ని సైతం ఆయన పట్టించుకోవడం లేదు. ఆయన వ్యాధితో బాధ పడుతున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా నాని అయితే స్పందించడం లేదు. ఆయన మిత్రుడు మాజీ మంత్రి పేర్ని నాని దానిని ఖండిస్తూ అవన్నీ టీడీపీ వారి పోస్టింగులే తప్ప నాని బాగానే ఉన్నారని వివరణ ఇచ్చారు.

ఇదిలా ఉంటే కొడాలి నానిని కూటమి టార్గెట్ చేసిందని తెలుస్తోంది. దాంతో నాని తన వేరెబౌట్స్ ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు అని అంటున్నారు. ఆయన ఫోన్ లో సైతం అందుబాటులోకి రావడం లేదు అని అంటున్నారు. తన మీద టార్గెట్ ఉంటుందని తెలిసే ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

అయినా టీడీపీ కూటమి ప్రభుత్వం నానిని వదలదలచుకోవడం లేదు అని అంటున్నారు. ఇటీవల కాలంలో నాని మీద వరసబెట్టి పెడుతున్న కేసులే దానికి ఉదాహరణ అని అంటున్నారు. పాత కొత్త కేసులు కొడాలి మీద పెట్టి ఆయనను ఎలాగైనా అరెస్ట్ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఈ వార్తలు ప్రచారం కావడంతో గుడివాడలో నాని అనుచరులు అయితే తీవ్ర అంతర్మధనంలో ఉన్నారని అంటున్నారు.

తమ నేతను అరెస్ట్ చేస్తే ఇక తమ సంగతి ఏమిటి అని వారు కలవరపడుతున్నారు అని అంటున్నారు. అయితే కొడాలి నాని మాత్రం తనపైన నమోదు అయిన ప్రతీ కేసునూ న్యాయస్థానాల ద్వారానే పోరాడి రిలీఫ్ పొందేలా పక్కా ప్లాన్ తో ఉన్నారని అంటున్నారు. అయితే కొడాలి నాని అరెస్టు తప్పదని గుడివాడ లోపలా బయట జరుగుతున్న ప్రచారం మాత్రం వైసీపీ క్యాడర్ లో తీవ్ర అలజడినే రేపుతోంది అని అంటున్నారు.