Begin typing your search above and press return to search.

ప్రొ. కోదండరాం కు కీలక పదవి... తెరపైకి రేవంత్ సెటైర్లు!

బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సమావేశమైన తర్వాత గురువారం రాజ్‌ భవన్ నుంచి నిర్ణయం వెలువడడం గమనార్హం.

By:  Tupaki Desk   |   25 Jan 2024 10:54 AM GMT
ప్రొ. కోదండరాం కు కీలక పదవి... తెరపైకి  రేవంత్  సెటైర్లు!
X

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రొఫెసర్ కోదండరాం కు కీలక పదవి దక్కడం ఖాయమనే చర్చ ఎప్పటినుంచో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలను ముఖ్యమంత్రి కాకముందు.. అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి ధృవీకరించారు! త్వరలో కోదండరాం కు తగిన గౌరవం ఇవాల్సిన బాధ్యత తనపై ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోదరండరాం కు కీలక పదవి దక్కనుంది!

అవును... గతంలో ఒక ఇంటర్వ్యూలో సీఎం హోదాలో మాట్లాడిన రేవంత్ రెడ్డి... ఒకప్పుడు పెద్దల సభలో పెద్దమనుషులు ఉండేవారని.. అందులో భాగంగా చుక్కా రామయ్య, ప్రొ. నాగేశ్వర రావు, మొదలైనవారు ఉండటంతో ఆ సమావేశాలకు హాజరైతే.. ఇది నిజంగా పెద్దల సభే అనే అభిప్రాయం కలిగేదని.. వారంతా సభలోకి రాగానే లేచి నిలబడాలనిపించేదని.. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.

ఇందులో భాగంగా కేసీఆర్ పుణ్యమాని... పెద్దల సభగా చెప్పుకునే శాసన మండలిని రియల్ ఎస్టేట్ జనాలు చాయ్ దుకాణం వద్ద పెట్టుకునే మీటింగ్ లా మార్చేశారని అభిప్రాయపడ్డారు. ఆ సభలో మెజారిటీ జనాలు వాళ్లే ఉన్నారని ఫైరయ్యారు! శాసన మండలి అంటే చాయ్ తాగుతూ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ పెట్టుకునే పంచాయతీలా చేశారంటూ సెటైర్స్ వేశారు! ఈ సందర్భంగా కోదండరాం ను ఆ పెద్దల సభలోకి పంపాలని తాజాగా రేవంత్ నిర్ణయం తీసుకున్నారు!

ఇందులో భాగంగా... రాష్ట్రంలోని రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్టు అమీర్ ఆలీ ఖాన్ నియమితులయ్యారు. ఈ క్రమంలో... రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళిన ప్రతిపాదనలను పరిశీలించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సమావేశమైన తర్వాత గురువారం రాజ్‌ భవన్ నుంచి నిర్ణయం వెలువడడం గమనార్హం.

కాగా... గవర్నర్ నామినేటెడ్ కోటాలో ప్రముఖ విద్యావంతులు ప్రొఫెసర్ కోదండరాం, సియాసత్ పత్రిక మాజీ సంపాదకులు జహీర్ ఆలీఖాన్ కుమారుడైన జర్నలిస్టు అమీర్ అలీఖాన్ పేర్లను మంత్రివర్గం ఆమోదంతో ప్రభుత్వం రాజ్‌ భవన్ ఆమోదం కోసం పంపింది. ఈ నేపథ్యంలో... గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.