"ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి"... వర్మ నెక్స్ట్ స్టెప్ ఇదే!
దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన "వ్యూహం" సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 27 Dec 2023 10:18 AM GMTదర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన "వ్యూహం" సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా నెట్టింట ఆర్జీవీ వర్సెస్ టీడీపీ - జనసేన దిశగా నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది. ఇదే సమయంలో వ్యూహం సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతోపాటు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో ఆర్జీవీ డెన్ ఎదుట కొంతమంది దుండగులు రచ్చ చేశారు.
ఇవి చాలవన్నట్లు రాంగోపాల్ వర్మ తల తెస్తే కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని ప్రకటించారు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు. మంగళవారం ఒక టీవీ చానల్లో నిర్వహించిన డిబెట్ లో స్పందించిన ఆయన... ఆర్జీవీ తల తెస్తే కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆ స్టేట్ మెంట్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ విషయంపై వర్మ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు!
అవును... తన తల తెచ్చి ఇస్తే కోటి రూపాయల నజరానా అంటూ ప్రకటించిన విషయంపై రాం గోపాల్ వర్మ స్పందించారు. ఇందులో భాగంగా.. శ్రీనివాసరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలనే తన ఫిర్యాదుగా అధికారికంగా తీసుకోవాలని ఆ వీడియో బైట్ ని ట్యాగ్ చేసి మరీ ఆర్జీవీ ఏపీ పోలీసులకు పంపించారు. దీంతో... ఈ ఫిర్యాదుపై ఏపీపోలీసులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిగా మారింది.
కాగా... రాంగోపాల్ వర్మ రూపొందించిన "వ్యూహం" సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి వ్యూహం మూవీపై సెన్సార్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా... కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది. ఈ సమయంలో... బెంగళూరులో వ్యూహాం మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్ లభించింది.
ఈ సమయంలోనే హైదరాబాద్ లోని ఆర్జీవీ ఆఫీస్ (ఆర్జీవీ డెన్) ఎదుట కొందరు వ్యక్తులు ఆందోళన చేపట్టారు! ఈ సందర్భంగా వ్యూహం ఫ్లెక్సీలను తగులబెట్టారు. ఆర్జీవీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ లకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆర్జీవీ పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిసింది!
అనంతరం ఈ విషయాలపై స్పందించిన ఆర్జీవీ... “తన ఆఫీసు ముందు మీమీ కుక్కలు మొరుగుతున్నాయి.. పోలీసులు వచ్చే సరికి పారిపోయాయి” అంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు! ఈ క్రమంలో ఒక టీవీ ఛానల్ లో మాట్లాడిన కొలికపూడి శ్రీనివాస్ రావు... ఏకంగా ఆర్జీవీ తలతెస్తే కోటి నజరానా అని ప్రకటించేశారు! దీంతో... ఆర్జీవీ ఏపీ పోలీసులను ఆశ్రయించారు!