టీడీపీ ఎమ్మెల్యే సంచలన ప్రకటన... బాబు నుంచి కబురు!
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు.
By: Tupaki Desk | 5 July 2024 5:12 AM GMTతిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల ఒక ఇష్యూలో అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఈయన అత్యుత్సాహం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. వైసీపీ నేత చేపట్టిన నిర్మాణం అక్రమంటూ ఆయన చేసిన హల్ చల్ తీవ్ర చర్చనీయాశం అయ్యింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు.
అవును... కంభంపాడులో వైసీపీ నేత కాలసాని చెన్నారావు చేపట్టిన నిర్మాణం అక్రమం అంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరుండి కొంతమేర కూల్చివేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియా వేదికగా సంచలన ప్రకటన చేశారు.
ఇందులో భాగంగా... పదవి శాశ్వతం కాదని.. బాధితులకు న్యాయం చేయలేనప్పుడు తనలాంటి వారు రాజకీయాల్లో అవసరం లేదని అన్నారు. కంభంపాడులో కాలసాని చెన్నారావు అరాచకాలకు అడ్డే లేదని.. ఇతని అరాచకాల వల్ల ఎంతోమంది గ్రామం విడిచి వెళ్లిపోయారని.. ఇళ్లలోకి చొరబడి మహిళలను వేదిస్తారని చెప్పుకొచ్చారు.
ఇదే క్రమంలో... టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనే అప్పుడు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా... చెన్నారావుకి భయపడి ఆ గ్రామంలో పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పడం గమనార్హం. ఆ గ్రామంలో ఎవరైనా టీడీపీ జెండా కడితే కాళ్లూ, చేతులూ విరగ్గొడతారని.. పలువురి భయపెట్టి, దాడులు చేయించి భూములు లాక్కుంటారని విమర్శించారు.
అదేవిధంగా... గతంలో చంద్రబాబు, కేశినేని చిన్ని కాన్వాయ్ పై చెన్నారావు రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. ఈ విషయంపై కేసు పెట్టినా పోలీసులు వారం రోజుల్లు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో కొలికపూడు శ్రీనివాసరావును చంద్రబాబు వివరణ కోరారని తెలుస్తుంది.
కంభంపాడులో జరిగిన వ్యవహారంపై చంద్రబాబు శ్రీనివాసరవుని పిలిపించి వివరణ కోరారని తెలుస్తుంది. దీంతో.. కొంతమంది అధికారుల తీరులో ఇంకా మార్పు రాలేదని.. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని తాన్ను కోరినా స్పందించకపోవడంతోనే తాను నేరుగా రంగంలోకి దిగినట్లు వివరణ ఇచ్చారని తెలుస్తుంది. దీంతో... ఏదైనా చట్ట ప్రకారం చేయాలని.. క్షేత్రస్థాయిలోకి వ్యక్తిగతంగా వెళ్లొద్దని బాబు సూచించారని సమాచారం!