Begin typing your search above and press return to search.

కొత్త కోణం: ‘క్రిమినల్’ మూవీని గుర్తుకు తెస్తున్న కోల్ కతా హత్యాచారం

ఇలా సినిమాలోని అంశాలు.. కోల్ కతా వైద్యురాలి హత్యాచారంలోని విషయాల్ని కలిపితే.. రెండింటిలోనూ చాలానే అంశాలు కలుస్తాయని భావన మనసుకు కలగక మానదు.

By:  Tupaki Desk   |   23 Aug 2024 4:22 AM GMT
కొత్త కోణం: ‘క్రిమినల్’ మూవీని గుర్తుకు తెస్తున్న కోల్ కతా హత్యాచారం
X

దాదాపు 30 ఏళ్ల క్రితం.. 1994లో వచ్చింది ‘క్రిమినల్’ మూవీ. కింగ్ నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో మనీషా కొయిరాలా.. రమ్యక్రిష్ణలు హీరోయిన్లు. ఇప్పటికే ఈ సినిమా కథ గుర్తుకు వచ్చేసి ఉంటుంది. ఈ కథను గుర్తుకు తెచ్చుకొని.. ఇటీవల వెలుగు చూసిన కోల్ కతా హత్యాచారాన్ని పోల్చి చూసినప్పుడు.. చాలానే సారూప్యతలు కనిపిస్తాయి. కాకుంటే.. సినిమాలో మనీషా కొయిరాల పాత్రను హత్య చేస్తారు. కోల్ కతా ఉదంతంలో హత్యాచారం చేసి చంపారు.

అక్కడ కూడా మనీషా కొయిరాలా వైద్యురాలు. కోల్ కతా ఉదంతంలో బాధితురాలు పీజీ విద్యార్థినే. సినిమాలో మనీషా పాత్రధారిణి హత్యకు కారణం.. ఆసుపత్రిలో జరిగే అన్యాయాల్ని గుర్తించి.. దానిపై కంప్లైంట్ చేస్తామని చెప్పటమే. ఈ రియల్ ఉదంతంలోనూ ఆసుపత్రిలో జరుగుతున్న ఘోరాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పటమేనన్న వార్తలు వస్తున్నాయి.

ఇలా సినిమాలోని అంశాలు.. కోల్ కతా వైద్యురాలి హత్యాచారంలోని విషయాల్ని కలిపితే.. రెండింటిలోనూ చాలానే అంశాలు కలుస్తాయని భావన మనసుకు కలగక మానదు. అప్పట్లో ఈ మూవీ విడుదలైన సక్సెస్ ఫుల్ కావటం.. మనీషా కొయిరాల పాత్ర అప్పటి కుర్రకారును హత్తుకునేలా చేయటమే కాదు.. ఆ పాత్రకు ఎంతగానో కనెక్టు అయిపోవటం తెలిసిందే. క్రిమినల్ సినిమా కోణంలో.. కోల్ కతా హత్యాచార ఉదంతాన్ని చూస్తే.. చాలానే పెద్ద తలకాయల పాత్ర రియల్ దారుణంలో ఉందన్న భావన కలుగక మానదు. ఈ కోణంలో విచారణ జరిపితే.. దారుణాల పుట్ట పగలటం ఖాయమని చెప్పక తప్పదు.