Begin typing your search above and press return to search.

బెంగాల్ జూనియర్ డాక్టర్ ఘటనలో బిగ్ ట్విస్ట్... పోలీసుల వెర్షన్ ఇదే!

గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పటల్ లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన ఎంత సంచలనంగా మారిందనే సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   17 Aug 2024 3:41 PM GMT
బెంగాల్ జూనియర్ డాక్టర్ ఘటనలో బిగ్ ట్విస్ట్... పోలీసుల వెర్షన్ ఇదే!
X

గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ హాస్పటల్ లో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన ఎంత సంచలనంగా మారిందనే సంగతి తెలిసిందే. ఏకంగా ఒక రోజు వైద్య సేవలు బంద్ చేసేటంత నిర్ణయం తీసుకోవడానికి ఈ ఘటన కారణమైంది. దీనిపై ముఖ్యమంత్రి మమత బెనర్జీ తాజాగా పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు.

ఈ నేపథ్యంలో ఓ బిగ్ ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఇప్పటి వరకూ ఈ ఘటన విషయంలో జరుగుతున్న ప్రచారాలు, వస్తోన్న కథనాలకు దాదాపు భిన్నమైన వెర్షన్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు తాజగా ఈ ఘటనలో విస్తుగొలిపే విషయాలు నిజం కాదని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు లేవన్నట్లుగా తాజాగా కోల్ కతా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. జరుగుతున్న ప్రచారాలను తోసిపుచ్చారు.

అవును... తాజాగా జూనియర్ వైద్యురాలి పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ ఎదుట జరిగింది. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీశారు! అయితే... అందులో ఎక్కడా ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్లు ప్రస్థావించలేదు. ఇదే సమయంలో ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవాలు లేవని తేల్చారు. ఈ నేపథ్యంలో తాజాగా కోల్ కతా పోలీస్ చీఫ్ వినేశ్ గోయల్ స్పందించారు.

ఇందులో భాగంగా... ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం గుర్తించినట్లు ప్రచారం జరుగుతుందని.. అసలు ఇలాంటి సమాచారం ఎక్కడి నుంచి పుడుతుందో తెలియడం లేదని.. ప్రజల్లో లేనిపోని గందరగోళం సృష్టించేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నట్లున్నాయని ఈ సందర్భంగా వినేశ్ గోయాల్ అసహనం వ్యక్తం చేశారు.

మరోపక్క జూనియర్ వైద్యురాలి మృతి ఘటనను అసహజ మరణంగా నమోదు చేయడంపైనా కోల్ కతా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో స్పందించిన వినేశ్ గోయల్... ఎటువంటి ఫిర్యాదు లేనప్పుడు అలా నమోదు చేయడం చాలా సహజమని.. అసహజ మరణంగా నమోదు చేయడం ద్వారా విషయాన్ని దాచిపెట్టి, ఆత్మహత్యగా చూపించాలని అనుకుంటామని ఎందుకు చెప్తున్నారో తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే జూనియర్ వైద్యురాలు రాత్రి విధుల్లో ఉండగా.. మరుసటి రోజు ఉదయం ఆస్పత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ కేసులో పోలీసులు ఓ వాలంటీర్ ని నిందితుడిగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును కోల్ కతా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. మరోపక్క ఆదివారం కల్లా ఈ కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇటు పోలీసులకు, అటు సీబీఐకి అల్టిమేటం జరీ చేశారు.