Begin typing your search above and press return to search.

షాకింగ్... వైసీపీ సర్కార్ లిక్కర్ అంత మంది లివర్స్ ని టచ్ చేసిందా?

ఈ సమయంలో.. గత ప్రభుత్వ హయాంలో ఏపీ వాసుల ఆరోగ్యంపై కీలక విషయం తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   21 Nov 2024 3:49 AM GMT
షాకింగ్... వైసీపీ సర్కార్  లిక్కర్  అంత మంది లివర్స్  ని టచ్  చేసిందా?
X

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీ ఎంత వివాదాస్పదమైందనే సంగతి తెలిసిందే. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేయడంలో దీని పాత్ర కీలకంగా చెబుతారు. ఈ సమయంలో.. గత ప్రభుత్వ హయాంలో ఏపీ వాసుల ఆరోగ్యంపై కీలక విషయం తెరపైకి వచ్చింది.

అవును... గతంలో లిక్కర్ పాలసీ పేరు చెప్పి వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అసెంబ్లీలో తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు సరఫరా చేసే మద్యం కంపెనీలకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారని అన్నారు.

ఇదే సమయంలో... కొనుగోలు ఆర్డర్లు ఇవ్వకుండా ఆ కంపెనీలను ఏపీ మార్కెట్ నుంచి తరిమేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పెద్దలకు నచ్చిన బ్రాండ్లకు మాత్రమే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారని.. మద్యం తయారీ, విక్రయాలు, సరఫరా.. ఇలా మొత్తం వ్యవస్థను తమ గుప్పిట పెట్టుకున్నారని మంత్రి మండిపడ్డారు.

ఈ సమయంలో... నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్.సీ.ఆర్.బీ) వెల్లడించిన లెక్కల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన విషయం ఆసక్తిగా మారింది. ఇందులో భాగంగా... 2018తో పోలిస్తే 2022 నాటికి లిక్కర్, డ్రగ్స్ వ్యసనపరుల ఆత్మహత్యలు 100% పెరగగా.. తాగుబోతు భర్తల చేతిలో హింసకు గురైన మహిళల సంఖ్య 76.40% పెరిగింది.

ఇక.. లివర్, కిడ్నీ వ్యాధుల బారినపడిన వారి సంఖ్య విపరీతంగా పెరిగిందని ఘణాంకాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా... 2019తో పోలిస్తే ఏపీలో లివర్ వ్యాధుల బారినపడిన వారి సంఖ్య 52 శాతం పెరగగా.. కిడ్నీ వ్యాధుల బారిన పడినవారి సంఖ్య 54% పెరిగిందని ఎన్.సీ.ఆర్.బీ. నివేదిక వెల్లడించింది!

దీనికంతటికీ గత ప్రభుత్వ హయాంలో పెద్దలు లిక్కర్ సరఫరా కంపెనీల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడటం.. ఫలితంగా నాణ్యతలో లోపం రావడం కారణం అయ్యి ఉండొచ్చనే చర్చా మొదలైంది! ఈ విషయాలపైనా అసెంబ్లీలో మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. ఈ సందర్భంగా... రూ.3,113 కోట్ల కమిషన్లు తీసుకున్నారని తెలిపారు!

ఇందులో భాగంగా... గత ప్రభుత్వ హయాంలో ఒక్కో మద్యం కేసుకు రూ.250 చొప్పున రూ.2,861 కోట్లు.. ఒక్కో బీరు కేసుకు రూ.50 చొప్పున రూ.252 కోట్లు.. వెరసి మొత్తం రూ.3,113 కోట్ల మేర అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని.. దీనిపై సీఐడీ విచారణ జరుగుతుందని తెలిపారు!