'తల్లికి వందనం', 'ఉచిత బస్సు' పై మంత్రి కీలక వ్యాఖ్యలు!
దీంతో... అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీల అమలు విషయంలో కూటమి ప్రభుత్వానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 11 Nov 2024 12:02 PM GMTఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీల్లో టీడీపీ ప్రధానంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు వారి విజయంలో కీలక భూమిక పోషించాయనే చెప్పాలి. దీంతో... అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీల అమలు విషయంలో కూటమి ప్రభుత్వానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయని అంటున్నారు. దానికి కారణం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.
దీంతో... ప్రధానంగా లక్షల మంది తల్లులు ఎన్నో ఆశలు పెట్టుకున్న "తల్లికి వందనం" పథకం ఇప్పటికీ ప్రారంభం కాలేని పరిస్థితి. దీనిపై ఇప్పటికే స్పందించిన లోకేష్.. అంతా కూర్చుని ఒక రోడ్ మ్యాప్ వేసుకుని, వచ్చే ఏడాది నుంచి ప్రారంభిద్దామని చెప్పారు. మరోపక్క ఉచిత బస్సు ప్రయాణం హామీ గురించి మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో పార్ధసారథి స్పందించారు.
అవును... కూటమి ప్రభుత్వ బాధ్యతల్లో అత్యంత కీలకంగా మారిన వాటిలో సూపర్ సిక్స్ హామీల అమలు ఒకటనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో... తాజాగా ఏపీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి స్పందించారు. ఈ మేరకు ఈ సూపర్ సిక్స్ హామీలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని.. వ్యవస్థలను ధ్వంసం చేసి పరిపాలన అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. ఇదే సమయంలో రూ.1.35 లక్షల కోట్ల మేర బకాయిలు పెట్టి వెళ్లిపోయిందని.. ఈ సమయంలో ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు.
ఇదే సమయంలో... కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని చెప్పిన పార్థసారథి... ఇచ్చిన హామీ మేరకు అని పథకాలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ లో రెండు ప్రధాన హామీలు (పెన్షన్స్ రూ.1000 పెంపు, ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు) ఇప్పటికే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా మరో రెండు పథకాలకు ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ బడ్జెట్ లోనే నిధులు కేటాయించామని... ఈ ఏడాదిలోనే ఉచిత బస్సు పథకాన్ని అమ