Begin typing your search above and press return to search.

100 రోజులు .. 1.20 లక్షల ఇండ్లు !

రాబోయే వంద రోజుల్లో లక్షా 20వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు

By:  Tupaki Desk   |   21 Aug 2024 7:34 AM GMT
100 రోజులు .. 1.20 లక్షల ఇండ్లు !
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు శుభవార్త తెలిపింది. రాబోయే వంద రోజుల్లో లక్షా 20వేల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. భవిష్యత్తులో మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేయబోతున్నామని వెల్లడించారు.

గత వైసీపీ ప్రభుత్వ రాజకీయ కక్షపూరిత ఆలోచనలు కారణంగా ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందిపడ్డారని, సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా గత ప్రభుత్వం భూములు తీసుకుందని విమర్శించారు. 2014-2019 గృహ నిర్మాణాలపై కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని, వాటికి కూడా డబ్బులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని అన్నారు.

గత ప్రభుత్వంలో గృహనిర్మాణాలను వ్యాపార ధోరణిలో చూశారని, రాష్ట్రంలో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాయని పార్దసారధి తెలిపారు. రుణం తీసుకుని ఇల్లు నిర్మాణం చేపట్టని వారు భవిష్యత్తులో ఇబ్బందిపడతారని స్పష్టం చేశారు.

రూ.4 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా రూ.30 వేలు సైతం అందిస్తామని, గృహనిర్మాణాలు మట్టి సమస్యను అధిగమించేందుకు ఫ్లై యాష్ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిపారు.