Begin typing your search above and press return to search.

వాలంటీర్లపై మంత్రి పార్ధసారధి హాట్ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు

By:  Tupaki Desk   |   1 July 2024 1:30 AM GMT
వాలంటీర్లపై మంత్రి పార్ధసారధి హాట్ కామెంట్స్!
X

ఏపీలో జూలై 1 నుంచి పెన్షన్ల పంపిణీకి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్న సంగతి తెలిసిందే. జూలై నెలవారీ పెన్షన్ రూ.4 వేలకు తోడుగా ఏప్రిల్ నుంచి పెంచిన రూ.4 వేల పెన్షన్ ప్రకారం నెలకు వెయ్యి రూపాయల ఎరియర్స్ చొప్పున మూడు నెలలకు గాను మొత్తం 3 వేల రూపాయలు కలిపి టోటల్ గా రూ.7 వేలు ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించనున్నారు. వాలంటీర్ల ద్వారా కాకుండా ఈసారి సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే వాలంటీర్ల వ్యవస్థ భవితవ్యంపై సందిగ్దత ఏర్పడింది.

ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. వాలంటీర్లపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రూ.1000 పెంచేందుకు వైసీపీకి ఐదేళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పెన్షన్లు అందిస్తామని, తొలి రోజే 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలోనే జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ జరగాలని అధికారులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు అందించాలని చెప్పారు. మరోవైపు, తాడేపల్లి మండలం పెనుమాకలో సీఎం చంద్రబాబు రేపు స్వయంగా కొందరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయబోతున్న సంగతి తెలిసిందే.