హరీష్ రావు పార్టీ మార్పుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మనం అధికారంలో ఉన్నప్పుడు ఇతరులను బాధపెట్టే వారికి తరువాత వారికి వచ్చే కష్టాలను చూసి ఇతరులు కూడా అలాగే నవ్వుకుంటారనే ఇంగిత జ్ణానం ఉండదు.
By: Tupaki Desk | 29 March 2024 11:30 AM GMTమనం ఏదైనా తప్పు చేస్తే వాడి పాపం వాడినే దహిస్తోందని అంటుంటారు. ఇప్పుడు కేసీఆర్ కు ఈ సామెత అక్షరాలా సరిపోతుంది. తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వారందరిని లాక్కున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ వారు మాత్రం నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఒకరు బాధపడితే నవ్వుకునే వారికి అదే పరిస్థితి రావడం తప్పనిసరే. మనం అధికారంలో ఉన్నప్పుడు ఇతరులను బాధపెట్టే వారికి తరువాత వారికి వచ్చే కష్టాలను చూసి ఇతరులు కూడా అలాగే నవ్వుకుంటారనే ఇంగిత జ్ణానం ఉండదు.
అందుకే ఇప్పుడు కేసీఆర్ ఎవరిని ఏమి అనడం లేదు. అన్నింటికి సెటైర్లు వేసే కేసీఆర్ కాంగ్రెస్ లో చేరికల మీద మాత్రం చప్పుడు చేయడం లేదు. బీఆర్ఎస్ నేతలంతా క్యూ కడుతున్నా పెదవి విప్పడం లేదు. ఎందుకంటే గతంలో తాను చేసిన తప్పులే ఇప్పుడు జరుగుతున్నాయని సరిపెట్టుకుంటున్నారు. ఏదైనా విమర్శలు చేస్తే కాంగ్రెస్ వాళ్లే వారిని అపహాస్యం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాము పాటించిన సూత్రాలనే ఇప్పుడు మేం చేస్తున్నామని లెక్క అప్పజెపుతున్నారు.
బీఆర్ఎస్ వాళ్లు కాంగ్రెస్ లో చేరికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల తరువాత మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ కండువా కప్పుకుంటారని తనదైన శైలిలో జోస్యం చెప్పారు. ఈ విషయం చాలా రోజులుగా ప్రజల్లో అనుమానాలు నాటుతోంది. ఇక బీఆర్ఎస్ పని అయిపో యిందని అందరు తలో దారి చూసుకుంటున్నారని చెబుతున్నారు.
బీఆర్ఎస్ లో సీనియర్ నేతలందరు పార్టీ మారుతున్నారు. చాలా మంది కాంగ్రెస్ వారితో టచ్ లో ఉన్నారని చాలా సందర్భాల్లో చెబుతున్నారు. అందుకే ఇప్పుడు హరీష్ రావు కూడా బీజేపీలో చేరడం ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో హరీష్ రావు పార్టీ మార్పుపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. హరీష్ రావు పార్టీని వీడితో ఇబ్బందులు తప్పవనే అంటున్నారు.
పార్టీలో కేటీఆర్ కు అంతా సత్తా లేదని చెబుతున్నారు. ఇన్నాళ్లు కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ తోనే పార్టీ నడిచిందనే అభిప్రాయాలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నేతలంతా హ్యాండ్ ఇస్తుండటంతో ఇక ఏం జరుగుతుందోననే బెంగ పట్టుకుంది. మొత్తానికి కేసీఆర్ చేసిన పాపం ప్రస్తుతం ఆయననే దహించి వస్తోందనేది నిర్వివాదాంశం అని చెప్పొచ్చని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.