కేటీఆర్ ని అల్టిమేట్ కామెంట్ తో గుచ్చేసిన కోమటిరెడ్డి...!
అంతే కాదు ఇది అల్టిమేట్ కామెంట్ అని కూడా అంటున్నారు. అవును కదా సబబే కదా. అందునా కేటీఆర్ చెప్పిన ధర్మ నీతి ప్రకారం ఇంకా కరెక్టే కదా అని అంటున్నారు.
By: Tupaki Desk | 16 March 2024 5:41 PM GMTరాజకీయాలలో అరువులు అప్పులూ అసలు ఉండవు. ఎక్కడో ఒక చోటా తీర్చేసుకోవాల్సిందే. కొందరికి లేట్ అవుతుంది కొందరికి తొందరగా అప్పు తీర్చమంటుంది. అంతా టైం. ఇపుడు ఆ బ్యాడ్ టైం కేసీఆర్ కుటుంబానికి వచ్చింది. కేసీఆర్ ముద్దుల కుమార్తె కవితని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విషయంలో తెలంగాణా అంతటా రచ్చ చేస్తూ బీఆర్ ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
సరిగ్గా ఇక్కడే తెలంగాణా కాంగ్రెస్ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎంటర్ అయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తే తెలంగాణాలో ఎందుకు ఆందోళన భాయ్ అంటూ ఆయన చిత్రంగా ప్రశ్నించారు. దాంతో కేటీఆర్ కి ఎక్కడో గుచ్చేసినట్లుగా ఈ కామెంట్ ఉంది అని నెటిజన్లు అంటున్నారు.
అంతే కాదు ఇది అల్టిమేట్ కామెంట్ అని కూడా అంటున్నారు. అవును కదా సబబే కదా. అందునా కేటీఆర్ చెప్పిన ధర్మ నీతి ప్రకారం ఇంకా కరెక్టే కదా అని అంటున్నారు. అదెలా అంటే ఇప్పటికి ఆరు నెలల క్రితం 2023 సెప్టెంబర్ లో చంద్రబాబు ఏపీలో అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ ని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు హైదరాబాద్ లో ఆందోళన చేస్తే నాడు బీఆర్ఎస్ లో మంత్రిగా ఉన్న కేటీఆర్ అన్న మాటలను అంతా ఇపుడు గుర్తు చేసుకుంటున్నారు.
ఏపీలో చంద్రబాబుని అరెస్ట్ చేస్తే తెలంగాణాలో లొల్లి పెడతారు ఏంటి అక్కడికి పోయి ఆందోళనలు చేసుకోండి అని కేటీఆర్ కసురుకున్నారు. ఇపుడు అదే మాటను డిఫరెంట్ టోన్ లో అప్పచెప్పేశారు ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిజానికి ఆనాడు కేటీయార్ అన్న మాటలు ఏకంగా బీఆర్ ఎస్ కి తీరని డ్యామేజ్ చేశాయి. ఎన్నికల్లో ఓడిపోవడానికి అది కూడా ఒక అంశంగా మారింది అని కూడా విశ్లేషణలు ఉనాయి.
ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అదే విధంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీ నేతలు దీని మీద తమ నిరసనలు ప్రారంభించగా తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా టిట్ ఫర్ టాట్ అనిపించారు అన్న మాట.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తెలంగాణకు సంబంధం లేదని, కవిత అరెస్టుపై బీఆర్‌ఎస్ నేతలు ఢిల్లీలో నిరసన తెలపాలి కానీ తెలంగాణలో కాదని కోమటిరెడ్డి అచ్చం కేటీఆర్ చెప్పినట్లే చెప్పారు. పైగా బాబుని అరెస్ట్ చేసినప్పుడు కేటీఆర్ ఇదే చెప్పారని ఫ్లాష్ బ్యాక్ తో ఆయన్ని కార్నర్ చేశారు.
మొత్తానికి కష్టకాలం వస్తే మామూలుగా ఉండదు ఇలాగే ఉంటుంది అన్నట్లుగా ఒక వైపు పార్టీ కష్టాలు మరో వైపు కుటుంబంలో కీలక నేత అరెస్టులు ఇంకో వైపు ప్రత్యర్థి రాజకీయ పార్టీల విమర్శలు దెప్పుళ్ళూ, పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు బ్రో అని నెటిజన్లు అంటున్నారు అంటే కర్మ సిద్ధాంతం గురించి సీరియస్ గానే ఆలోచించాల్సిందేనేమో.