Begin typing your search above and press return to search.

దాడితో దౌత్యం.. కొణ‌తాల క‌ష్టాలు తీరేనా?

దీనిని నిజం చేస్తూ దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి అనకాపల్లి జనసేన అభ్యర్ధి , మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మరో మాజీమంత్రి, టీడీపీ నేత దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు.

By:  Tupaki Desk   |   8 March 2024 11:30 PM GMT
దాడితో దౌత్యం.. కొణ‌తాల క‌ష్టాలు తీరేనా?
X

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. దీనిని నిజం చేస్తూ దశాబ్ధాల వైరాన్ని పక్కన పెట్టి అనకాపల్లి జనసేన అభ్యర్ధి , మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మరో మాజీమంత్రి, టీడీపీ నేత దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు స‌హ‌క‌రించాల‌ని అభ్య‌ర్థించారు. అయితే.. త‌న కుమారుడికి టికెట్ ద‌క్క‌లేద‌న్న ఆవేద‌న‌లో ఉన్న దాడి.. ఏమేరకు కొణ‌తాల‌కు స‌హ‌క‌రిస్తార‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అంతేకాదు.. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంగా ఉన్న నేప‌థ్యంలో దాడి స‌హ‌కారం ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తిగా మారింది.

దాడి టీడీపీలో కొణతాల కాంగ్రెస్‌లో చాలా కాలం ప్రత్యర్ధులుగా ఉన్నారు. ఎత్తులకు పైఎత్తులు వేసుకొన్నారు. ఒక దశలో ఇద్దరూ వైసీపీలో ఉన్నప్పటికీ మాటలు, పలకరింపులు లేకుండానే కాలం గడచిపోయింది. 2014 ఎన్నికల్లో దాడి తనయుడు రత్నాకర్ విశాఖ పశ్చిమ నుంచి పోటీ చేయగా, కొణతాల సోదరుడు రఘునాధ్ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఆ తరువాత వీరభద్రరావు అనకాపల్లి టికెట్ ఆశించి టీడీపీలోకి వెళ్లగా, కొణతాల జనసేనలో చేరారు. పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించడంతో రాజకీయ విబేధాలను పక్కనపెట్టి దాడి వీరభద్రరావు ఇంటికి కొణతాల వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన మద్దతు కోరారు.

రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఆయన మంత్రివర్గంలో పనిచేసిన రామకృష్ణ సమర్థవంతమైన పాత్ర పోషించారన్నారు. పొత్తులో భాగంగా కొణతాలకు టికెట్టు జనసేన నుండి ఇచ్చార‌ని తెలిపారు. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం.. ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. రామకృష్ణ గెలుపునకు సంపూర్ణ సహకారం అందిస్తానని ప్రకటించారు.

జనసేన నేత, టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. దాడి వీరభద్రరావుతో కాలేజీ నుండి అనుబం ధం ఉందన్నారు. ఆయన అధ్యాపకుడిగా ఉన్నప్పుడు ఏఎంఎ ఎల్ కాలేజీలో తాను చదువుకున్న‌ట్టు తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన సహకారం తనకు ఎంతో అవస రమన్నారు. కాగా, 40 ఏళ్లుగా ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని నేతలు ఇప్పుడు కలిసి పనిచేయాలని నిర్ణయిం తీసుకున్నారు. ఇది అనకాపల్లి రాజకీయాలతో పాటు ఉమ్మడి విశాఖలో ఆసక్తికర పరిణామంగా మారింది.