Begin typing your search above and press return to search.

కొణతాల టికెట్ డౌట్ లో పడిందా...!?

నాగబాబు కనుక ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటే అసెంబ్లీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ సీటు కూడా డౌట్ లో పడుతుందా అన్న చర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   2 March 2024 1:41 PM GMT
కొణతాల టికెట్ డౌట్ లో పడిందా...!?
X

అనకాపల్లి జిల్లాలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ దశ తిరిగిందని అంతా భావించారు. పదిహేనేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత కొణతాల అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా జనసేన తరఫున పోటీ చేయబోతున్నారు అని కూడా ఆయన అనుచరులు ఆందించారు. అయితే కొణతాలకు టికెట్ ఇవ్వడాన్ని ఇటు జనసేన లోని నేతలు అటు టీడీపీలోని ఆశావహులు కూడా అభ్యంతరం పెట్టారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అయితే ఒక దశలో తీవ్ర నిర్ణయం దిశగా వెళ్లారు.

ఈ పరిణామాల నేపధ్యంలో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్న నాగబాబు తప్పుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. నాగబాబు కనుక ఎంపీగా పోటీ నుంచి తప్పుకుంటే అసెంబ్లీ అభ్యర్థిగా కొణతాల రామకృష్ణ సీటు కూడా డౌట్ లో పడుతుందా అన్న చర్చ సాగుతోంది.

ఎందుకంటే కొణతాల మద్దతు కోసమే నాగబాబు ప్రయత్నం చేశారు. పవన్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ మంతనాలు జరిపి కొణతాలకు అనకాపల్లి టికెట్ వచ్చేలా చూశారు అని అంటున్నారు. ఇపుడు నాగబాబు పోటీ నుంచి తప్పుకుంటే కొణతాల సీటు విషయంలో మార్పులు ఉంటాయని చర్చ సాగుతోంది.

కొణతాలకు మనస్పూర్తిగా మద్దతు ఇచ్చేందుకు టీడీపీలోని వర్గాలు ఇష్టడపడంలేదు అని అంటున్నారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు లాంటి వారు అయితే దూరంగా ఉండిపోతారు అని అంటున్నారు. ఇక రాజకీయంగా కూడా కూటమి ఇబ్బందులో పడుతుందని అంటున్నారు. మొత్తం మీద కొణతాల టికెట్ విషయంలో కానీ లేక అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో కానీ స్వేచ్చగా నిర్ణాయలు తీసుకుంటూ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధులను ఎంపిక చేయడానికి వీలుగానే నాగబాబు పోటీ నుంచి దూరం జరిగారు అన్న మాట అయితే ఉంది.

ఇవన్నీ పక్కన పెడితే కొణతాలను తప్పిస్తే ఆయన వైపు నుంచి నిరసన వస్తుందా అంటే దానిని కూడా పరిశీలించిన మీదటనే సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. ఎటూ అనకాపల్లి అసెంబ్లీ సీటు గవర సామాజిక వర్గానికే ఇస్తారు కాబట్టి ఏమీ ప్రభావం పడే చాన్స్ ఉండదని అంటున్నారు. ఇక అనకాపల్లి ఎంపీ అసెంబ్లీ సీట్లు టీడీపీ తీసుకుని జనసేనకు వేరే చోట వాటిని కేటాయిస్తుంది అని అంటున్నారు.

ఆ విధంగా జనసేనకు అటు విశాఖ ఇటు అనకాపల్లి లోని జనసేన ఆశావహులలో కొందరి ఆశలు ఈ విధంగా తీర్చే చాన్స్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి నాగబాబు అనకాపల్లి ఎంపీ సీటుకు పోటీ పట్ల విముఖంగా ఉన్నారని వస్తున్న వార్తల వెనక టోటల్ చెంజెస్ ఉంటాయని అంటున్నారు. దాంతో ఎవరికి టికెట్లు దక్కుతాయి ఎవరికి టికెట్లు పోతాయి అన్న చర్చ అయితే వాడిగా వేడిగా సాగుతోంది.