Begin typing your search above and press return to search.

బాబు బీజేపీ పొత్తు మీద కొణతాల ఏమంటున్నారో ?

అయితే స్వపక్షం వారు మాత్రం బాబు చేస్తున్నది అంతా పరమార్ధం కోసమే అంటారు. బాబుకు ఎదుటి పక్షంలో ఉంటూ రాజకీయం చేసినపుడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా బాబుని ఘాటుగా విమర్శించేవారు.

By:  Tupaki Desk   |   8 March 2024 3:36 PM GMT
బాబు బీజేపీ పొత్తు మీద కొణతాల ఏమంటున్నారో ?
X

చంద్రబాబు ఏమి చేసిన లోక కళ్యాణం అంటూ మొదలుపెడతారు అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతూ ఉంటారు. ఇక నెటిజన్లు కొందరు అయితే బాబు 1999 నుంచి జరిగే ప్రతీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు చారిత్రక అవసరం అని ఎన్ని సార్లు స్టేట్మెంట్ ఇచ్చారో కూడా లెక్క కట్టి కూడా చెప్పుకొస్తున్నారు.

పొత్తులు అంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం టీడీపీ గెలుపు అయితే చారిత్రాత్మక అవసరం ఇదే బాబు గత పాతికేళ్ళుగా చెబుతున్న మాటలు అని ప్రత్యర్ధులు కూడా విమర్శిస్తూంటారు. అయితే స్వపక్షం వారు మాత్రం బాబు చేస్తున్నది అంతా పరమార్ధం కోసమే అంటారు. బాబుకు ఎదుటి పక్షంలో ఉంటూ రాజకీయం చేసినపుడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా బాబుని ఘాటుగా విమర్శించేవారు.

ఇపుడు ఆయన టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేనలో కీలక నాయకుడు అయ్యారు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగుతున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో పొత్తు మంచిదే అని సమర్ధించారు. అంతే కాదు ఈ పొత్తు వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుందని కొణతాల చెబుతున్నారు. ఉత్తరాంధ్రా వంటి వెనకబడిన జిల్లాలకు నిధులు ఎక్కువగా తెచ్చుకోవచ్చు అని అంటున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ తొందరగా పూర్తి అవుతుందని కూడా ఆశాభావంతో చెబుతున్నారు. చంద్రబాబు సీఎం గా ఉండగానే వెనకబడిన జిలాలకు ప్రతీ ఏటా ఇచ్చే 350 కోట్ల రూపాయలు ఆపేశారు అన్నది తెలిసిందే. పోలవరం ఆనాడు ఎలా ఉందో కూడా తెలుసు అంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో పొత్తుకు బాబు వెళ్తే ఎంతో కొంత ఊరట. కానీ బీజేపీ అలా తగ్గేది కాదు,

బాబు పొత్తులు రాజకీయం కోసమే తప్ప రాష్ట్రం కోసం కాదు అని వైసీపీ వంటి పార్టీలు చెబుతున్నాయి. అయినా స్టీల్ ప్లాంట్ మాత్రమే కాదు దేశంలో అనేక ప్రభుత్వ రంగ సంస్థలు బీజేపీ మూడవ సారి గద్దెనెక్కితే జరిగే విషయాలు అని జాతీయ స్థాయిలో మీడియాలో వస్తున్న విషయాలు. ఇన్ని తెలిసి కూడా బాబు బీజేపీ పొత్తు లోక కళ్యాణం అని కొణతాల నమ్ముతున్నారా లేక జనాలను నమ్మమని అంటున్నారా అన్నదే వైసీపీ నేతల ప్రశ్నలు.