Begin typing your search above and press return to search.

కొండా సురేఖ అధికారంలో ఉన్నారని చెప్పాలా?

ఈ నేపథ్యంలోనే.. గురుకులాల్లో కుట్రల వెనుక బీఆరెస్స్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.

By:  Tupaki Desk   |   30 Nov 2024 3:48 AM GMT
కొండా సురేఖ అధికారంలో ఉన్నారని  చెప్పాలా?
X

అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కొత్త ప్రభుత్వానికి హనీమూన్ పిరియడ్ అంటారు. సాధారణంగా.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ కాస్త కుదురుకోవడానికి, పాలన విషయంలో గాడిన పడటానికి, మంత్రులు తమ తమ శాఖలపై అవగాహన తెచ్చుకోవడానికి, సీఎం పాలనపై పట్టు సాధించడానికి ఈమాత్రం సమయం ఉండాలని అంటుంటారు.

అయితే... ఇటీవల కాలంలో అధికారంలోకి ఎంత కాలం అయినా ఇప్పటికీ గత ప్రభుత్వం పైనే ఆరోపణలు చేస్తున్న ట్రెండ్ విపరీతంగా పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. అధికారంలోకి ఏడాది అవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపై ఆరోపణలు ఏలా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

అవును... సంక్షేమ హాస్టల్స్ వ్యవహారంపై స్పందించిన మంత్రి కొండా సురేఖ... గత ప్రభుత్వ హయాంలో హాస్టళ్లలోని భోజనంలో పురుగులు వచ్చేవని.. సంక్షేమ హాస్టళ్లలో సదుపాయాలు కొరవడినా బీఆరెస్స్ ప్రభుత్వం పట్టించుకోలేదని.. గత ప్రభుత్వం వీటిని పూర్తగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆర్.ఎస్.పీ.పై ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా... తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వత ఒక విద్యర్థిని చనిపోయిందని.. బాధిత విద్యార్థిని ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే.. గురుకులాల్లో కుట్రల వెనుక బీఆరెస్స్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హస్తం ఉందంటూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ కుట్రల వెనుక ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని.. గతంలో ఆయన గురుకులాల కార్యదర్శిగా పని చేశారని.. అక్కడ తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని.. కొండా సురేఖ చెప్పుకొచ్చారు. దీంతో... ఇదే నిజమైతే.. ఈ ప్రభుత్వానికి ఆ విషయం ఇప్పుడే తెలిసిందా? తెలిసి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అని నిలదీస్తున్నారు!

ఇక అధికారంలో ఉన్నంత కాలం మంచి జరిగితే అది తమ గొప్పతనం.. చెడు జరిగితే అది గత ప్రభుత్వ పాలన ఫలితం అంటూ ఇదే స్థాయి రాజకీయం చేయడం వల్ల ప్రజలు హర్షించరని.. ఈ విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు పరిశీలకులు. నిజంగా.. గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్.ఎస్.పీ. హస్తం ఉంటే.. ఇప్పుడు గురుకులాల కార్యదర్శిగా ఉన్న వారి పరిస్థితి ఏమిటి అని నిలదీస్తున్నారు!

ఇదే సమయంలో గురుకులాల్లో కుట్రల వెనుక ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ హస్తం ఉంటే ప్రభుత్వం ఇంతకాలం ఏమి చేస్తున్నాట్లు? ఇంకా ఎన్ని ప్రాణాలు పోయిన తర్వాత చర్యలకు ఉపక్రమిస్తారన్నట్లు? కొండా సురేఖ ఆరోపణలు మాత్రమే చేస్తారా? చర్యలు తీసుకోరా? ఈ సందర్భంగా తెరపైకి ఎన్నో ప్రశ్నలు!