Begin typing your search above and press return to search.

‘ఆదిమూలం’లోనే తుంచేసిన టీడీపీ.. వైసీపీ అసలు చేయనిది ఇదే

వాస్తవానికి ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయా పార్టీలు విచారణకు కాస్త టైం తీసుకుని స్పందిస్తుంటాయి.

By:  Tupaki Desk   |   5 Sep 2024 9:33 AM GMT
‘ఆదిమూలం’లోనే తుంచేసిన టీడీపీ.. వైసీపీ అసలు చేయనిది ఇదే
X

వరదల విలయంలో చిక్కుకున్న ఏపీలో కీలక పరిణామం.. ఊహించని కలకలం.. ఇప్పటివరకు వైసీపీ శిబిరానికే పరిమితమైన వీడియోలు లైంగిక ఆరోపణల సునామీ అధికార టీడీపీనీ తాకింది.. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం తదుపరి చర్యలు.. ఇలా చెప్పుకొంటూ ఉంటే కీలక నాయకులుగా ఉన్నవారి విషయంలో వైసీపీ చేయని సాహసాన్ని టీడీపీ చేసిందా? అనే అభిప్రాయం వినిపిస్తోంది. అసలు విషయానికి వస్తే తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం.. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడుకు ఓ మహిళ లేఖ రాయడం.. ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. అసలే ఏపీలో ఇటీవలి కాలంలో ఈ తరహా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికార పార్టీ కూటమిని ఇరుకున పడేసే వ్యవహారం ఇది. ప్రతిపక్ష వైసీపీని పదేపదే దెప్పిపొడిచే అంశంలో తనే ఆత్మరక్షణలో పడే పరిస్థితి వచ్చింది.

సూపర్ ఫాస్ట్ రియాక్షన్

వాస్తవానికి ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు వచ్చినప్పుడు ఆయా పార్టీలు విచారణకు కాస్త టైం తీసుకుని స్పందిస్తుంటాయి. అయితే, సత్యవేడు ఎమ్మెల్యే విషయంలో టీడీపీ రియాక్షన్ సూపర్ ఫాస్ట్ గా సాగింది. ఇదే అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపణలను సంబంధిత మహిళ పెన్‌ కెమెరాలో రికార్డు చేసినట్లు చెప్పడం కారణమో..? వాటిని సాక్ష్యాధారాలుగా పరిగణించిందో ఏమో..? వెంటనే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. ఎమ్మెల్యే తనను రాత్రి వేళల్లో మెసేజ్‌లు పంపి వేధించారని.. తిరుపతి భీమా ప్యారడైజ్‌ హోటల్‌ కు పిలిపించి వేధించారని మహిళ తన ఆరోపణల్లో పేర్కొనడాన్ని టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా తీసుకుంది. దీంతో ఆదిమూలంపై ఆదిమూలం (అత్యంత ప్రారంభం)లోనే చర్య తీసుకున్నట్లయింది.

వైసీపీకి వాయిస్ లేకుండా..?

టీడీపీ ఎమ్మెల్యే స్థాయి నాయకుడు అని కూడా చూడకుండా వెంటనే చర్యలు తీసుకోవడం బహుశా ఆ పార్టీ వారినే కాక వైసీపీని కంగుతినేలా చేసి ఉంటుందనడంలో సందేహం లేదు. కాగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వీడియోస్ కొన్ని సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ టైం లో వైస్సార్సీపీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అదే గత ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం . ఇప్పుడు టీడీపీ మాత్రం సిటింగ్ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా వేటు వేసేసింది. తద్వారా వైసీపీకి వాయిస్ లేకుండా చేసింది. ఇప్పుడు వైసీపీ ఏం చెప్పినప్పటికీ.. టీడీపీ చర్యలను ప్రస్తావించకుండా ఉండలేదు. ఏదేమైనా కట్టుతప్పిన ఎమ్మెల్యేను నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టిన టీడీపీ ప్రస్తుతానికి సంక్షోభం నుంచి గట్టెక్కింది.