Begin typing your search above and press return to search.

కొటియా కథ : నాలుగు ఓట్లు.. రెండు రాష్ట్రాలు

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో 12 గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు వేస్తూ రెండు రాష్ట్రాల్లో రెండు రేషన్ కార్డులు కలిగిఉన్న సంగతి తెలిసింది.

By:  Tupaki Desk   |   6 May 2024 1:30 PM GMT
కొటియా కథ : నాలుగు ఓట్లు.. రెండు రాష్ట్రాలు
X

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో 12 గ్రామాల ప్రజలు రెండు రాష్ట్రాల పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు వేస్తూ రెండు రాష్ట్రాల్లో రెండు రేషన్ కార్డులు కలిగిఉన్న సంగతి తెలిసింది.

సరిగ్గా అలాంటి కథే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్యన నెలకొన్నది. ఇక్కడి కొటియా క్లస్టర్ పరిధిలో 21 గ్రామాలు ఉన్నాయి. ఏపీ, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో విశాఖపట్నానికి 150 కిలోమీటర్ల దూరంలోని మారుమూల కొండల్లో బ్రిటీష్‌ కాలం నుంచి ఈ గ్రామాల మధ్యన ఈ పరిస్థితి కొనసాగుతున్నది.

ఇక్కడ అందరికీ రెండు ఓటు కార్డులతోపాటు రెండు రేషన్‌ కార్డులు కూడా ఉన్నాయి. దీంతో వీరికి రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుండి సంక్షేమ పథకాలు అందుతున్నాయి.

కొటియా క్లస్టర్‌ ప్రజలు రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతో పాటు, రెండు రాష్ట్రాల పరిధిలోకి వచ్చే లోక్‌సభ స్థానాలకు ఓట్లు వేస్తారు. ఈ 21 గ్రామాలు ఒడిశాలో కోరాపుట్‌ లోక్‌సభ, పొత్తంగి శాసనసభ నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా ఇవే గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో అరకు లోక్‌సభ, సాలూరు శాసనసభ స్థానాల పరిధిలోకి వస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా వివిధ రాష్ట్రాల పరిధిలో ఇలాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడం విచిత్రం.