Begin typing your search above and press return to search.

ఇండియాకు వస్తే జైలుకే..యూట్యూబర్ అన్వేష్ కు మాస్ వార్నింగ్..

తాజాగా, ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణ కుమారి అన్వేష్ తీరుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...

By:  Tupaki Desk   |   29 March 2025 12:30 PM
ఇండియాకు వస్తే జైలుకే..యూట్యూబర్ అన్వేష్ కు మాస్ వార్నింగ్..
X

బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తున్న ప్రముఖులపై 'నా అన్వేషణ' ఫేమ్ అన్వేష్ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్‌లో వరుస వీడియోల ద్వారా ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. తాజాగా, ప్రముఖ కమెడియన్ అలీని కూడా ఆయన విమర్శించారు. అయితే అన్వేష్ చేస్తున్నది మంచి పని అయినప్పటికీ, ఆయన ఉపయోగిస్తున్న భాష మాత్రం చాలామందికి ఆగ్రహం తెప్పిస్తోంది. ముఖ్యంగా పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ తల్లి గురించి అన్వేష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇతర సెలబ్రిటీల విషయంలోనూ ఆయన ఇదే తరహా భాషను ఉపయోగిస్తున్నారు. నోరు తెరిస్తే బూతులు తిడుతూ ఉండటంతో ఆయన మంచి ప్రయత్నం చేస్తున్నప్పటికీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

తాజాగా, ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కృష్ణ కుమారి అన్వేష్ తీరుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "నీ స్థాయి ఎంత? నీ బతుకెంత? దమ్ముంటే ముందు ఇండియాకు రా. నీ మీద చాలా కేసులు సిద్ధంగా ఉన్నాయి. ఇమ్రాన్ తల్లి ఆ పని చేసింది, సన్నీ యాదవ్ తల్లి ఆ పని చేయాలి, వీఆర్ రాజు అసలు వాళ్ళ అమ్మకు ఎలా పుట్టాడో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు మీ అమ్మకు ఎలా పుట్టావో, అతను కూడా అలాగే పుట్టాడు. అందరూ అలాగే పుడతారు, నువ్వేమైనా ప్రత్యేకమా? నిన్ను గోడకేసి కొడితే రెండు ముక్కలు అవుతావు. మొన్న సజ్జనార్ గారు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అంటే నువ్వేం అన్నావ్? వండుకునేవాడికి ఒక్క కూర, అడుక్కునేవాడికి 66 కూరలు అని మాట్లాడావు. నువ్వు అడుక్కుంటేనే నీ దగ్గరికి అమ్మాయిలు వచ్చేస్తున్నారా? ఒక్క ముగ్గురు అమ్మాయిలు నీ దగ్గరికి వస్తే చచ్చిపోతావు. ఇతనికి ఆ సన్నీ యాదవ్ అంటే కడుపు మంట. ఎందుకంటే అతను కూడా ఇతనిలాగే ప్రపంచ యాత్రికుడు అట. ఇతన్ని దాటేస్తుంటే అక్కసు వెళ్లగక్కుతున్నాడు" అంటూ ఆమె ఘాటుగా విమర్శించారు.

ప్రపంచ యాత్రికుడిగా అన్వేష్ ఎంతటి ప్రజాదరణ పొందారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన టాలీవుడ్ ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఆయన్ని బాగా ఫాలో అవుతుంటారు. కేవలం టూర్ వీడియోలు మాత్రమే చేస్తాడని అనుకుంటే, అన్వేష్ తనలోని ఈ కొత్త కోణాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇప్పటివరకు యూట్యూబ్ ద్వారా తాను 60 లక్షల రూపాయలు సంపాదించానని, వాటిని తన కోసమే ఉపయోగించానని, కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్‌ల వల్ల నష్టపోయిన వారి కోసం ఉపయోగిస్తానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇందులో ఎంత నిజముందో వేచి చూడాలి.

మొత్తంగా అన్వేష్ టాలీవుడ్ లోని ప్రముఖులు, యూట్యూబర్స్ పై వాడుతున్న భాషపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీరును అందరూ ఎండగడుతున్నారు. ఇప్పుడు ప్రముఖ యాక్టివిస్టులు కూడా స్పందిస్తుండడంతో అన్వేష్ వ్యవహారం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.