Begin typing your search above and press return to search.

చంద్రబాబు, పవన్ ఎలాంటి వారంటే.. బీజేపీ ఎంపీ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై బీజేపీ ఎంపీ, బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 9:56 AM GMT
చంద్రబాబు, పవన్ ఎలాంటి వారంటే.. బీజేపీ ఎంపీ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు
X

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై బీజేపీ ఎంపీ, బీసీ ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతల వల్ల ఏపీ సర్వతోముఖాభివృద్దిని సాధిస్తోందన్నారు. చంద్రబాబు మంచి పరిపాలన దక్షుడని, పవన్ మంచి హృదయం ఉన్న నాయకుడని కృష్ణయ్య ప్రశంసించారు.

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విశాఖ వచ్చిన కృష్ణయ్య కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని కితాబిచ్చారు. చంద్రబాబు విజనరీతో సంపద సృష్టించి పేదరికార్ని రూపుమాపాలని తపించే నాయకుడు చంద్రబాబు అంటూ కొనియాడారు. మేధావులు, విద్యావేత్తల్లో చంద్రబాబుపై మంచి అభిప్రాయం ఉందన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైనా కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు. మంచి హృదయం ఉన్న నాయకుడిగా పవన్ను కీర్తించిన కృష్ణయ్య పేదలను చూస్తే పవన్ కరిగిపోతారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా విశాఖ వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ప్రధాని దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.

ఈ రోజు విశాఖలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ దాదాపు రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.1.85 లక్షల కోట్లతో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఏర్పాటుచేసే గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ కు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా విశాఖ రైల్వే జోన్, రైల్వే లైన్లు, రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ వల్ల సుమారు 57 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షా 50 వేల మందిని తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని పర్యటన దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బుధవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.