రఘురామ రాజుకి షాక్ - సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ పాల్ విడుదల!
కాగా, రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో విజయ్ పాల్ ఏ4గా ఉన్నారు.
By: Tupaki Desk | 13 Feb 2025 2:45 AM GMTఏపీ డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు, సీఐడీ రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ కి గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వాడానికి రఘురామకృష్ణరాజు వచ్చిన రోజే విజయ్ పాల్ కి బెయిల్ మంజూరు కావడం విశేషం. కాగా, రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో విజయ్ పాల్ ఏ4గా ఉన్నారు.
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కేసులో తాజా అప్డేట్ రాజకీయంగా సంచలనం రేకెత్తిస్తోంది. వైసీపీ అధికారంలో ఉండగా, రాజద్రోహం కేసులో ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో ఆయనపై కస్టోడియల్ టార్చర్ చేశారని కేసు నమోదైంది. ఇందులో మాజీ సీఎం జగన్ తోపాటు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ ప్రభావతితోపాటు మరికొందరిపై కేసు నమోదైంది. అయితే ఇందులో విజయ్ పాల్ తోపాటు గుడివాడ టీడీపీ నేత కామినేని తులసిబాబును పోలీసులు అరెస్టు చేశారు.
మిగతా నిందితులపై పోలీసులు సరైన యాక్షన్ తీసుకోవడం లేదని రఘురామకృష్ణరాజు అసమ్మతి వ్యక్తం చేస్తున్న సందర్భంలోనే విజయ్ పాల్ కి బెయిల్ మంజూరైంది. దీంతో గుంటూరులోనే ఉన్న రఘురామకృష్ణరాజు ప్రభుత్వంపై షాకింగ్ కామెంట్లు చేశారు. ఈ కేసులో నిందితులకు ఎవరో సాయం చేస్తున్నారని తనకు అనిపిస్తోందని, నిందితులను ఎవరు ఎన్నాళ్లు రక్షిస్తారో తానూ చూస్తానని రఘురామ హెచ్చరించారు. మొత్తానికి విజయ్ పాల్ కి బెయిల్ మంజూరు కావడంతో ఈ కేసు మరో మలుపు తిరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.