Begin typing your search above and press return to search.

నాలుగోసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఛాన్స్‌... ఏవరీ వైద్యనాథన్‌!

అవును... రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 నుంచి ఇప్పటివరకూ 8 ఏళ్లలో సుమారు ఆరేళ్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగగలిగారు కృష్ణమూర్తి వైద్యనాథన్‌

By:  Tupaki Desk   |   27 Aug 2023 5:30 AM GMT
నాలుగోసారి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఛాన్స్‌... ఏవరీ వైద్యనాథన్‌!
X

టీటీడీ బోర్డులో సభ్యత్వానికి ఉన్న డిమాండ్ సంగతి తెలిసిందే. ప్రభుత్వాలు ఏవైనా.. ఎవరు అధికారంలో ఉన్నా.. టీటీడీ బోర్డ్ మెంబర్ ల నియామకం తలకుమించిన భారం అవుతుందనే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తికి మాత్రం ఇప్పటికి నాలుగుసార్లు ఈ ఛాన్స్ దక్కింది!

అవును... రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 నుంచి ఇప్పటివరకూ 8 ఏళ్లలో సుమారు ఆరేళ్లు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగగలిగారు కృష్ణమూర్తి వైద్యనాథన్‌! దీంతో... ఈయన ఎవరు.. బ్యాక్ గ్రౌండ్ ఏమిటి.. ఎవరి రికమండేషన్స్ అయినా ఉన్నాయా.. అనే చర్చ మొదలైంది.

అటు చంద్రబాబు హయాంలోనూ టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేసిన కృష్ణమూర్తి వైద్యనాథన్... జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా ఆ ఛాన్స్ కొడుతున్నారు. చాలా మంది బడా నేతలు సైతం తమ జీవిత కాలంలో ఒక్కసారైనా టీటీడీ బోర్డు మెంబర్ అవ్వాలని కలలు కంటుంటే... ఈయనకు మాత్రం ఎలా కుదురుతుందని తలలు పట్టుకుంటున్నారంట.

చెన్నైకి చెందిన ఈ ఆడిటర్‌.. 2015 ఏప్రిల్‌ లో తొలిసారి టీడీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. అనంతరం వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత 2019 సెప్టెంబరులో బోర్డు సభ్యుడిగా కృష్ణమూర్తిని నియమించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ వరుసగా అవకాశం వస్తోంది.

ఇలా రాష్ట్రం విడిపోయిన తర్వాత 2015 నుంచి ఇప్పటివరకూ 8 ఏళ్లలో ఆరేళ్ల పాటు టీటీడీ బోర్డు మెంబర్ గా కొనసాగిన ఆయనకు తాజాగా మరోసారి ఛాన్స్ దక్కింది. అయితే ఆయనకు కేంద్రం లోని ఒక మహిళా మంత్రి సిఫారసు ఉందని అంటున్నారు.

అవును... కేంద్రంలోని ఓ కీలక మహిళామంత్రి సిఫార్సుతో ఆయన టీటీడీ బోర్డు మెంబర్ గా వచ్చారనే ప్రచారం ఉంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేంద్రంలో ప్రధాని తర్వాత కీలకమంత్రి సిఫార్సులతో కృష్ణమూర్తి టీటీడీ బోర్డు మెంబర్ ఛాన్స్ పొందగలుగుతున్నారనే తెలుస్తోంది!