Begin typing your search above and press return to search.

2025లో భారత ఆర్థిక వ్యవస్థపై.. ఐఎంఎఫ్ ఎండీ కీలక వ్యాఖ్యలు!

ఇందులో భాగంగా... ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా అనుసరించే వాణిజ్య విధానం ఆధారంగా కొంత అనిశ్చితి ఉంటుందని ఎండీ వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 11:30 AM GMT
2025లో భారత ఆర్థిక వ్యవస్థపై.. ఐఎంఎఫ్  ఎండీ కీలక వ్యాఖ్యలు!
X

త్వరలో అమెరికా తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారే అవకాశం ఉందని చెప్పుకుంటున్న వేళ.. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) నుంచి ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా అనుసరించే వాణిజ్య విధానం ఆధారంగా కొంత అనిశ్చితి ఉంటుందని ఎండీ వ్యాఖ్యానించారు.

అవును... అమెరికా అనుసరించే వాణిజ్య విధానం ఆధారంగా ప్రపంచ వ్యప్తంగా ఆర్థిక వ్యవస్థలో కొంత అనిశ్చితి ఉంటుందని చెప్పిన ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టాలినా జార్జివా... ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ కొంచెం బలహీనమయ్యే అవకాశం ఉందని అన్నారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఆర్థిక వృద్ధిలో తాము ఊహించిన అగ్రరాజ్యం అమెరికా కొంచెం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది అని చెప్పిన క్రిస్టాలినా జార్జివా... యూరోపియన్ యూనియన్ మాత్రం ప్రస్తుతం ఉన్న స్థాయికే పరిమితం కావొచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. భారత ఆర్థిక వ్యవస్థపైనా కామెంట్ చేశారు.

ఇందులో భాగంగా... స్థిరమైన ప్రపంచ వృద్ధి ఉన్నప్పటికీ భారత ఆర్థికవ్యవస్థ కొద్దిగా బలహీనపడే అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు ఐఎంఎఫ్ ఎండీ వెల్లడించారు. అయితే... అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. మరోపక్క బ్రెజిల్ మాత్రం కొంత ఎక్కువ ద్రవ్యోభణాన్ని ఎదుర్కోవచ్చని క్రిస్టాలినా జార్జివా అన్నారు.

ఇదే సమయంలో అమెరికా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో ద్రవ్యోల్బణం పలు సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని.. ఇందులో భాగంగా.. దేశీయ డిమాండ్, ఒత్తిడి తదితర సవాళ్లు చైనాలో కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. ఇదే క్రమంలో... ఈ ఏడాదిలో ఆర్థిక విధానాలు చాలా అనిశ్చితిగా ఉండే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు.

కాగా... గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఈ నెల 20న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చెయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో... భారత్ ను సుంకాల రాజు అని గతంలో అభ్వర్ణించిన ఆయన... చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై అదనపు టారిఫ్ లు విధించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు!