Begin typing your search above and press return to search.

తెలంగాణలో త్వరలో మరో రెండు అరెస్టులు.. భారీ కుదుపు ఖాయం?

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇలాంటి సందర్భం కలలో కూడా ఊహించనిది.

By:  Tupaki Desk   |   13 Dec 2024 12:15 PM GMT
తెలంగాణలో త్వరలో మరో రెండు అరెస్టులు.. భారీ కుదుపు ఖాయం?
X

ఉరుము లేని పిడుగులా.. ఊహించని వానలా.. తెలుగు సినీ హీరో అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్ జాతీయ అవార్డు పొందిన నటుడు కావడం, పుష్ప సినిమాలతో అతడు జాతీయ స్థాయి హీరో కావడంతో ఈ అరెస్టు దేశవ్యాప్తంగానూ సంచలనం కావడం ఖాయం. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇలాంటి సందర్భం కలలో కూడా ఊహించనిది. ఒకవైపు పుష్ప-2 అఖండ విజయంతో జోష్ మీద ఉన్న బన్నీకి బిగ్ షాక్. అయితే, ఇది ఇక్కడితో ముగియలేదని.. బన్నీది కేవలం యాక్సిడెంటల్ అరెస్టు అని.. తెలంగాణలో త్వరలో మరో రెండు పెద్ద అరెస్టులు కూడా ఉన్నాయని అంటున్నారు.

తర్వాత ఆయనేనా?

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా-ఈ కార్‌ రేస్ వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేందుకు తెలంగాణ గవర్నర్‌ ఆమోదం లభించినట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఫైల్ ప్రభుత్వానికి చేరిందట కూడా. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను అరెస్టు ప్రస్తావన వస్తోంది. వాస్తవానికి కేటీఆర్ ఇటీవల పలుసార్లు తన అరెస్టు గురించి మాట్లాడారు. ప్రభుత్వం కూడా ఫార్ములా ఈ కేసుపై గట్టిగానే ఉంది. దీంతో త్వరలో అరెస్టు కాబోయేది కేటీఆర్ అని అంటున్నారు.

మోహన్ బాబు కూడానా?

సీనియర్ నటుడు మోహన్ బాబ్ కుటుంబ వివాదం నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. చిన్న కుమారుడు మనోజ్ తో మోహన్ బాబుకు ఉన్న ఆస్తి తగాదాలు దీంతో బయటపడ్డాయి. అయితే, వీటి కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడితో విషయం తీవ్రమైంది. అటు తిరుపతిలోనూ ఇటు హైదరాబాద్ శివారు జల్ పల్లిలోనూ జర్నలిస్టులపై దాడి పట్ల ఆ వర్గం నుంచి నిరసన పెద్దఎత్తున వ్యక్తమైంది. ఈ క్రమంలో హైకోర్టులో మోహన్ బాబుకు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ వేశారు. హత్యాయత్నం కేసు అయినందున ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మోహన్ బాబును త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలు.. అంచనాలే.. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.