Begin typing your search above and press return to search.

కేటీఅర్ కి తప్పదా... ఏం జరగనుంది ?

ఇదిలా ఉంటే కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏంటి అన్నది తెలిసిందే ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసులో యాభై నాలుగు కోట్ల రూపాయలను కేటీఆర్ మంత్రిగా ఉండగా విదేశీ సంస్థలకు మళ్లించారని అభిపోయగాన్ని మోపారు.

By:  Tupaki Desk   |   15 Jan 2025 10:35 AM GMT
కేటీఅర్ కి తప్పదా... ఏం జరగనుంది ?
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బ తగిలిన నేపథ్యంలో ఏమి జరగనుంది అన్న చర్చకు తెర లేస్తోంది. ఎందుకంటే రేపు కేటీఅర్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరవుతున్నారు. ఈడీ విచారణ తరువాత ఏసీబీ విచారణ ఉందని అంటున్నారు. దాంతో కేటీఅర్ విషయంలో ఏమి జరగబోతోంది అన్నది హాట్ డిస్కషన్ పాయింట్ గా ఉంది.

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కి అక్కడ నిరాశ ఎదురైంది. హైకోర్టు ఆదేశాలపై తాము జోక్యం చేసుకోలేమని దేశ అత్యున్నత న్యాయ స్థానం తెలియచేసిన తరువాత కేటీఅర్ ఇక ఏ రకమైన పరిణామాలు జరిగినా సిద్ధ పడాల్సిందే అని అంటున్నారు.

నిజానికి చూస్తేకేటీఆర్ తో పాటు బీఆర్ ఎస్ శ్రేణులు సుప్రీం కోర్టు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఈ కేసు పూర్తి స్థాయిలో విచారణ జరిగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడడంతో కేటీఆర్ కు నిరాశ ఎదురైంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే కేటీఆర్ మీద పెట్టిన కేసు ఏంటి అన్నది తెలిసిందే ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసులో యాభై నాలుగు కోట్ల రూపాయలను కేటీఆర్ మంత్రిగా ఉండగా విదేశీ సంస్థలకు మళ్లించారని అభిపోయగాన్ని మోపారు. అలా ఏసీబీ, ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. అంతే కాదు ఈ యాభై నాలుగు కోట్ల రూపాయలు తిరిగి బీఆర్ఎస్ ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసిందని అలా మొత్తం మీద చూసుకుంటే క్విడ్ ప్రోకో జరిగిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీంతో ఈ కేసుకు అధిక ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఈ కేసులో మరో కీలకమైన పాయింట్ ఏంటి అంటే మంత్రి మండలి అనుమతి లేకుండా ఈ మొత్తాన్ని విదేశీ సంస్థలకు మళ్ళించారని ఆ విధంగా అవినీతి జరిగింది అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక కోర్టుల నుంచి ఏ రకమైన ఊరట కేటీఅర్ కి లభించకపోవడంతో దర్యాప్తు సంస్థలు ఏసీబీ ఈడీ దూకుడు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రేపు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరైన తరువాత లేటెస్ట్ గా మరోసారి ఏసీబీ నోటీసులు కేటీఆర్ కి ఇస్తుంది అని అంటున్నారు. ఆ తరువాత కేటీఆర్ ని విచారణ తరువాత అరెస్ట్ చేయవచ్చు అని కూడా ప్రచారం అయితే ఊహాగానాల రూపంలో సాగుతోంది.

అయితే కేటీఆర్ అవినీతి చేశారు అన్న దానిని బీఆర్ ఎస్ కొట్టి పారేస్తోంది. అంతే కాదు ఇదంతా కుట్ర అని అంటోంది. ఇక కేటీఆర్ అయితే తాను హైదరాబాద్ కి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకుని రావడానికే ఫార్ములా ఈ కారు రేసింగ్ విషయంలో చొవర తీసుకున్నాను అని చెబుతున్నారు. ఏది ఏమైనా కేటీఆర్ అరెస్ట్ అన్నది తప్పకపోవచ్చు అంటున్నారు దాంతో ఆయన జైలుకు వెళ్తే బీఆర్ ఎస్ ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది ఆ పార్టీ ఆలోచిస్తోంది. కేటీఆర్ జైలుకి వెళ్తే పార్టీని మరింత ఒడుపుగా దూకుడుగా నడిపేలా కేసీఅర్ వ్యూహాలు రచిస్తున్నారు అని అంటున్నారు.