Begin typing your search above and press return to search.

కేటీఆర్‌కు ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం.. అడిగిన క్వశ్చన్స్ ఇవే.!

తొలుత కేటీఆర్‌ను సాధారణ ప్రశ్నలు అడిగిన అధికారులు ఆ తరువాత కేసుకు సంబంధించిన కీలకమైన ప్రశ్నలను సాధించారు.

By:  Tupaki Desk   |   9 Jan 2025 9:56 AM GMT
కేటీఆర్‌కు ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం.. అడిగిన క్వశ్చన్స్ ఇవే.!
X

ఫార్ములా ఈ -కార్ రేసింగ్ కేసు వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హాజరయ్యారు. ఉదయం నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు కేటీఆర్ వచ్చిన వెంటనే విచారణను ప్రారంభించారు. తొలుత కేటీఆర్‌ను సాధారణ ప్రశ్నలు అడిగిన అధికారులు ఆ తరువాత కేసుకు సంబంధించిన కీలకమైన ప్రశ్నలను సాధించారు.

ఈ విచారణలో ముగ్గురు ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. ఈ విచారణకు కేటీఆర్ తరపు న్యాయవాది రామచంద్రరావు కూడా హాజరయ్యారు. విచారణ సందర్భంగా పలు అంశాలను చర్చకు తెచ్చిన ఏసీబీ.. సంబంధిత ప్రధాన విషయాలను కేటీఆర్ ముందుంచినట్లు తెలిసింది. కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో ఇవి ఉన్నట్లు తెలుస్తోంది.

ఫార్ములా ఈ కార్ రేసు ఎందుకు తీసుకురావాలనుకున్నారు..? ఎవరి నిర్ణయం వల్ల నగదు బదిలీ చేశారు..? హెచ్ఎండీఏ నిధులు ఎలా బదిలీ చేశారు..? క్యాబినెట్ అనుమతి ఉందా..? అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు ఎలా చేశారు..? ఈ అగ్రిమెంట్లు వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది..? కేటీఆర్ ఆదేశాలతోనే నగదు విడుదల చేశామని అరవింద్ కుమార్ స్టేట్మెంటు ఇచ్చారని, దీనిపై మీ సమాధానం ఏమిటి..? హెచ్ఎండిఏ నుంచి ఈ కార్ రేసింగ్ కు రూ.55 కోట్లు బదిలీ ఎలా జరిగింది..? నగదు బదిలీ చేయాలని ఎవరిని ఆదేశించారు..? పౌండ్ల రూపంలోకి మార్చి సొమ్ము బదిలీ చేశారా..? దీనికి ఆదాయ పన్ను మినహాయింపు ఉందా..? ఐటీకి హెచ్ఎండీఏ రూ.8.6 కోట్లు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది..?

కార్ రేస్ కోసం మీరు ఎవరెవరిని కాంటాక్ట్ చేశారు..? కేంద్రం నుంచి సహకారం అందించిన వాళ్లు ఎవరు.? ఫార్ములా ఈ కార్ రేస్‌కు సంబంధించి ఆఫీసర్లను మీరు ఎప్పుడు కలిశారు..? పది సీజన్స్ నిర్వహించాలని వాళ్లు షరతులు విధించారా..? ప్రతి సీజన్‌కు కొంత డబ్బు వాళ్లకు చెల్లించాల్సి ఉంటుందా..? ఏదైనా వివాదాలు వస్తే పరిష్కారం కోసం ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా.? మొదటి ఫార్ములా ఈ రేస్ కోసం ఎంతమంది పార్ట్నర్స్.? ట్రైపాడ్ అగ్రిమెంట్ లో ఉన్న నిబంధనలు ఏంటి.? మొదటి రేసింగ్లో ఎస్ నెక్స్ట్ కంపెనీ ఎంత పెట్టుబడులు పెట్టింది..? ఆర్థికంగా ఫార్ములా రేస్ కోసం ఏమైనా ఖర్చు పెట్టాయా..? ఫార్ములా సెకండ్ సీజన్ నుంచి ఏఎస్ నెక్స్ట్ ఎందుకు తప్పుకుంది..? ఏఎస్ నెక్స్ట్ ఎంతవరకు పెట్టుబడులు పెట్టింది..? ఏ మేరకు లాభాలు ఆశించింది..? తర్వాత ఎవరైనా కంపెనీలతో మీరు, అధికారులు సంప్రదింపులు చేశారా..? ఫార్ములా రేసు రద్దు కాకుండా డబ్బులు చెల్లించాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారు..? కేబినెట్ అనుమతి తీసుకోవాలని అధికారులు మీకు చెప్పలేదా..? 55 కోట్ల డబ్బును హెచ్ఎంటితో ఎలా పెట్టుబడులు పెట్టించారు..? అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ఏమిటి..? వంటి ప్రశ్నలను ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే వీటిలో చాలా ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పలేదని తెలుస్తోంది.