కేటీఆర్ తో రాబిన్ శర్మ!
బీఆర్ఎస్ కి సంబంధించిన ఒక కీలకమైన పరిణామంగా దీన్ని చూడాలి పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ఆ పార్టీ అతి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
By: Tupaki Desk | 27 Aug 2024 11:07 AM GMTబీఆర్ఎస్ కి సంబంధించిన ఒక కీలకమైన పరిణామంగా దీన్ని చూడాలి పార్టీని అభివృద్ధి చేసుకోవడానికి ఆ పార్టీ అతి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సెప్టెంబర్ నెలలో కేటీఆర్ బృందం తమిళనాడుకు వెళ్తోంది. ప్రాంతీయ పార్టీలు క్యాడర్ తో ఎలా ఉండాలో, పార్టీని ఎలా నడిపించాలో ఎలా నిర్ణయాలు తీసుకోవాలో తెలుసుకోవడానికి తమిళనాడుకు వెళ్ళి అక్కడ సీనియర్ మోస్ట్ పార్టీ అయిన డీఎంకె పార్టీ మీద ఒక స్టడీ చేయనుంది.
అలాగే ఏపీలో టీడీపీని నాలుగు దశాబ్దాలకు పైగా నడిపిస్తున్నారు. ఆ పార్టీ ఏ విధంగా క్యాడర్ ని కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది అన్నది కూడా అధ్యయనం చేస్తారు. ఇక ఒడిషాలో బిజూ జనతాదళ్ పార్టీ విషయంలోనూ ఆ పార్టీ ఏ విధంగా ఓటమి నుంచి విజయాల వైపు సాగుతుందో కూడా స్టడీ చేస్తారు. ఇలా సౌత్ లో పేరు పడిన రీజనల్ పార్టీలు ఏ విధంగా తమ ఫంక్షనింగ్ చేస్తున్నాయి. ఎత్తులు వ్యూహాలతో ఎలా దీర్ఘకాలంగా మనగలుగుతున్నాయి అన్న దాని మీద కేటీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ బృందం స్టడీ చేసి బీఆర్ఎస్ అధినాయకత్వానికి నివేదిక ఇవ్వనుంది.
ఇక చూస్తే 2019 ఎన్నికల్లో టీడీపీ బొక్క బోర్లా పడినా కూడా మొత్తం శక్తిని అంతా కూడదీసుకుని 2024 ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. మరి ఆ అయిదేళ్ళూ క్యాడర్ ని ఎలా బలోపేతం చేశారు అన్న దాని మీద టీడీపీకి చెందిన వ్యూహకర్త రాబిన్ శర్మతో కేటీఆర్ మీటింగ్ తొందరలోనే ఉంది అని అంటున్నారు.
టీడీపీని పటిష్టంగా నిర్మించడంతో పాటు సైలెంట్ గా క్యాడర్ ని ఎలా బలోపేతం చేశారో అన్నది తెలుసుకుంటారు అని అంటున్నారు. అలాగే కూటమి పార్టీలతో ఎలా ఉండాలో వంటి చాలా విషయాలు తెలుసుకోవడానికి రాబిన్ శర్మతో భేటీ అని అంటున్నారు. 2019లో దారుణంగా ఓటమి పాలు అయిన టీడీపీని మళ్లీ గెలిపించడంతో రాబిన్ శర్మ వ్యూహాలు చాలా వరకు హెల్ప్ గా మారాయని కేటీఆర్ నమ్ముతున్నారు అని అంటున్నారు.
అయితే పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కీలక వ్యక్తికి ఇపుడు అర్జంటుగా వేరే రాష్ట్రాలకు చెందిన పార్టీల మీద వాటి నిర్ణయాల మీద వారు ఎలా పార్టీని బలోపేతం చేశారు అన్న విషయాల మీద ఆసక్తి కలగడం విడ్డూరంగా ఉంది అని అంటున్నారు. అంతే కాదు వారు తీసుకున్న నిర్ణయాల మీద కూడా నమ్మకం కలగడం అధ్యయనం చేయాలనుకోవడం మీద కూడా చర్చ సాగుతోంది.
దీనిని బట్టి చూస్తే పదేళ్ళ పాటు అధికారంలో ఉండి తన పార్టీ మీద ఆయన ఏ మేరకు అవగాహన పెంచుకున్నారు అన్నది అర్థం అవుతోంది అని సెటైర్లు పడుతున్నాయి. బీఆర్ ఎస్ పార్టీ మీద ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ కి సరైన అవగాహన లేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
నిజానికి కేసీఆర్ అంటేనే సంచలనంగా చెబుతారు. అలాంటి కేసీఆర్ రాజకీయ వ్యూహకర్తలు అంటూ అధ్యయనాలు అంటూ చూడడం అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రభావం చాలానే బీఆర్ఎస్ మీద పడింది అని అంటున్నారు. తెలంగాణాలో ఉన్న 17 ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కి రాలేదు అంటనే పార్టీ పరిస్థితి అర్థం అవుతోంది అని అంటున్నారు.
చిత్రమేంటి అంటే అందులో ఏడు ఎంపీ సీట్లలో డిపాజిట్లు కూడా రాలేదు అన్నది ఇటీవల ఎన్నికలు బీఆర్ఎస్ సీన్ ఏమిటో చెప్పేశాయా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఇలా అన్ని విధాలుగా బీఆర్ఎస్ ఇబ్బందులు పడుతోంది అని తెలిసిపోతోంది అంటున్నారు. మరోసారి తెలంగాణా సెంటిమెంట్ ని రగిలిద్దామని కేసీఆర్ అనుకున్నా అయన కంటే ఆరు ఆకులు ఎక్కువగా చదివిన రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఉన్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి.
దీంతో రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ సైలెంట్ అయ్యారని, హరీష్ రావు, కేటీఆర్ లను ముందు పెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా స్థాపించిన పార్టీ. ఆ పార్టీ వయసు దాదాపు పాతికేళ్ళు. ఒడిషాలో బీజేపీ వయసు కూడా అంతే. ఇక టీడీపీ డీఎంకే మరింత కాలం నుంచి ప్రాంతీయ పార్టీలుగా ఉండవచ్చు.
కానీ రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం తరువాత కూడా సొంత పార్టీని ఎలా బలోపేతం చేసుకోవడం మీద అవగాహన లేదా అన్నదే చర్చగా వస్తోంది. ఏ పార్టీకి అయినా క్యాడర్ ప్రాణం. అలాగే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పెద్ద పీట వేయాలి. ఆ పని డీఎంకే అయినా టీడీపీ అయినా చేస్తూ వస్తున్నాయి. క్యాడర్ తో నిరంతరం టచ్ లో ఉంటున్నాయి. ఆ విషయాలను బీఆర్ఎస్ విస్మరించింది కాబట్టే ఈ అధ్యయనాలు అన్న సెటైర్లు అయితే పడుతున్నాయి. మరి ఈ అధ్యయనాలు ఏ విధంగా బీఆర్ఎస్ కి ఉపయోగపడతాయి అన్నది కూడా చూడాలని అంటున్నారు.