Begin typing your search above and press return to search.

బాబూ శభాష్ అంటున్న పొరుగు ప్రతిపక్షం!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుఫాను అనంతరం వరదలలో చిక్కుకున్న వారి విషయంలో చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ ని పొరుగు ప్రతిపక్షం మెచ్చుకుంటోంది.

By:  Tupaki Desk   |   3 Sep 2024 3:42 AM GMT
బాబూ శభాష్ అంటున్న పొరుగు ప్రతిపక్షం!
X

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తుఫాను అనంతరం వరదలలో చిక్కుకున్న వారి విషయంలో చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్ ని పొరుగు ప్రతిపక్షం మెచ్చుకుంటోంది. ఏపీలో అయితే వైసీపీ బాబు ఏమీ చేయడం లేదని అంతా వదిలేశారు అని అంటోంది. ఇది చిత్రంగానే ఉంది.

ఏపీలో చంద్రబాబుని తెలంగాణా ప్రతిపక్ష నేత బీఆర్ఎస్ కీలక నాయకుడు కేటీఆర్ పొగిడారు. ఏపీ సీఎం బెజవాడలో చేపడుతునన్ తుఫాన్ అనంతరం చర్యలు సూపర్ అని అన్నారు. ఏపీ ప్రభుత్వం ఆరు హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో సహాయ చర్యలు చేపడుతోందన్న కేటీఆర్ ఇది మెచ్చుకుని తీరాల్సిందే అంటున్నారు.

ఏపీలో ప్రజల ప్రాణాలను కాపాడుతూ వారికి తగిన సహాయం చేయడంలో ఏపీ ప్రభుత్వం ముందు ఉందని కేటీఆర్ అన్నారు. అదే తెలంగాణాలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది అని ఆయన ఘాటైన విమర్శలు చేశారు.

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో అని కేటీయార్ సెటైర్లు పేల్చారు. భయంకరమైన తుఫాన్ దాని ప్రభావంతో వరదలు ముంచెత్తినా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర పోతోందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణా ప్రభుత్వం రెస్క్యూ ఆపరేషన్ బిగ్ జీరో అని మార్కులు వేశారు

ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తొమ్మిది మంది ప్రాణాలు కాపాడితే ప్రభుత్వం అయి ఉండి ఏమి చేస్తోందని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ ని టార్గెట్ చేశారు. ఆ సంగతి పక్కన పెడితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం బాగా పనిచేస్తోందని కేటీఆర్ మార్కులు వేస్తే ఏపీ ప్రభుత్వం ఏమీ చేయడంలేదని వైసీపీ విమర్శిస్తోంది.

అసలు ప్రభుత్వం ఉదాశీన వైఖరి వల్లనే వరదలు వచ్చాయని కూడా నిందిస్తోంది. మరి ఏపీలో వైసీపీకి తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రత్యర్ధిగానే ఉంది. అందుకే పొగడడం లేదు అని అంటున్నారు. నిజానికి బీఆర్ ఎస్ కి కూడా టీడీపీ ప్రత్యర్ధిగానే ఉంది. కానీ రాజకీయ లౌక్యం తెలిసిన గులాబీ పార్టీ చంద్రబాబుని పొగుడుతూ రేవంత్ రెడ్డిని విమర్శిస్తోంది. మరి ఈ రకమైన లౌక్యం లేకపోవడం వల్లనే వైసీపీ భారీ ఓటమిని మూటకట్టుకుందని అంటున్నారు

అయినా ఎవరు ఏమనుకున్నా బాబు ఈ వయసులో పడుతున్న కష్టం ఆయన చేస్తున్న శ్రమకు సగటు జనాలు మెచ్చుకుంటున్నారు. ఏపీలో సాధారణ పరిస్థితులు రావాలని కూడా అంతా కోరుకుంటున్నారు. మొత్తం మీద చూస్తే బాబుకు మంచి మార్కులే పడుతున్నాయి అన్నది వాస్తవం.