Begin typing your search above and press return to search.

ఆటో డ్రైవర్ కోరిక తీర్చిన కేటీఆర్.. నువ్వు మారిపోయావ్ సారూ

కేసీఆర్ వారసత్వంతో కేటీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకున్నా చాలా తక్కువ సమయంలో ఎంతో పరిణతి పొందారని చెప్పొచ్చు.

By:  Tupaki Desk   |   2 Sep 2024 3:30 PM GMT
ఆటో డ్రైవర్ కోరిక తీర్చిన కేటీఆర్.. నువ్వు మారిపోయావ్ సారూ
X

కేసీఆర్ వారసత్వంతో కేటీఆర్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకున్నా చాలా తక్కువ సమయంలో ఎంతో పరిణతి పొందారని చెప్పొచ్చు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగి అక్కడి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతీసారి కేటీఆరే విజయం సాధించారు. నియోజకవర్గం నుంచి ప్రస్థానం మొదలు పెట్టిన కేటీఆర్.. ఆ తరువాత గత ప్రభుత్వంలో, పార్టీలో కీ రోల్ పాత్ర పోషించే స్థాయికి ఎదిగారు.

ఏ అభిమానికి అయినా తమ అభిమాన హీరోతో కానీ లేదా తమ అభిమాన పొలిటీషియన్‌తో కానీ సెల్ఫీలు దిగాలనే కోరిక ఉంటుంది. గత పదేళ్లు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఎవరైనా సామాన్య ప్రజలు సెల్ఫీలు అడిగితే అవాయిడ్ చేసే వారని కేటీఆర్‌పై అపవాదు ఉండేది. దానికి కారణాలూ లేకపోలేదు. అయితే.. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో అందరినీ దగ్గరికి తీస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఇందుకు నిదర్శనమే ఈ ఆటో డ్రైవర్‌తో సెల్ఫీ అని చెప్పొచ్చు.

ఇటీవల ఓ ఎమ్మెల్యే కుమారుడి రిసెప్షన్ వెళ్లి వస్తున్న కేటీఆర్‌ను మార్గమధ్యలో ఓ ఆటో డ్రైవర్ పలకరించాడు. ఒక ఫొటో దిగాలని కోరాడు. దీంతో వెంటనే కేటీఆర్ తన కారును ఆపేసి ఆటో డ్రైవర్‌తో కలిసి ఫొటో దిగాడు. అలాగే.. అటు వైపుగా వెళ్తున్న మరికొంత మంది అభిమానులు కేటీఆర్‌తో సెల్ఫీలు దిగారు. దీంతో వారంతా సంతోషంతో ఫ్యూచర్ సీఎం కేటీఆర్ అంటూ నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. అప్పటికి ఇప్పటికి కేటీఆర్ చాలా మారిపోయారు అంటూ గుసగుసలాడుకోవడం కనిపించింది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వివిధ కార్యక్రమాలు, సెక్యూరిటీ రీజన్స్‌తో కేటీఆర్ పెద్దగా ప్రజలతో కలిసిన సందర్భాలు లేవు. కానీ నేడు అధికారం పోయి.. హోదా లేకుండా.. సాధారణ ఎమ్మెల్యేగా మారాడు.. ఓ ఇద్దరు ముగ్గురు సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉంటే ఖచ్చితంగా ప్రజలతో మమేకం అవ్వాలి. అప్పుడే మళ్లీ గెలవగలం.. ప్రజల మెప్పు పొందుగలం. అందుకే కేటీఆర్ ఇలా అడిగిన వారికి అడగని వారికి కూడా సెల్ఫీలు ఇస్తూ ప్రజలతో కలిసి పోతూ అలా ఎంజాయ్ చేస్తున్నారు.ఐటీ మంత్రి విదేశాలకు వెళుతూ దిగ్గజ పారిశ్రామికవేత్తలను కలిసిన కేటీఆర్.. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇలా సాధారణంగా మారిపోవడం విశేషం.