Begin typing your search above and press return to search.

పురుషులు, మహిళలు కాదు.. భార్యభర్తలు... కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   28 Oct 2024 4:59 AM GMT
పురుషులు,  మహిళలు కాదు.. భార్యభర్తలు... కేటీఆర్  సంచలన  వ్యాఖ్యలు!
X

బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బావమరిదికి చెందిన ఫాంహౌస్ లో జరిగిన పార్టీపై పోలీసులు దాడి చేశారని.. కేసులు పెట్టారని.. ఆ పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి (55) కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలిందని.. ఈ పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు పాల్గొన్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలు తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే!

ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామలాతో కాంగ్రెస్, బీఆరెస్స్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు హోరెత్తాయి. మరోపక్క.. దీనికి సంబంధించిన నిజానిజాలను నిగ్గు తేల్చాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

అవును... తన బావమరిదికి చెందిన హౌస్ లో జరిగిన పార్టీకి సంబంధించిన వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు. ఇందులో భాగంగా... గత 11 నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతిని, వైఫల్యాలనూ ప్రశ్నించినందువల్లే తమ కుటుంబ సభ్యులు, బంధువులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రేవంత్ కుట్రలకు, అక్రమ కేసులకు భయపడబోమని ధ్వజమెత్తారు.

తమ బావమరిది జన్వాడలో కొత్త ఇల్లు కట్టుకున్నారని.. అది ఫాంహౌస్ కాదని.. ఆయన నివసించే ఇల్లు అని.. ఇలా కొత్త ఇంటికి వెళ్లినందుకు బందువులు, కుతుంబ సభ్యులతో దావత్ చేసుకున్నారని.. దీపావళికి ఒక ఫ్యామిలీ తన కొత్త ఇంట్లో దావత్ చేసుకుంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలంట అని అన్నారు.

ఇలా ఓ కుటుంబం జరుపుకుంటున్న కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అని అసత్యప్రచారం చేశారని.. ఫలితంగా అధికార పార్టీ నేతలు పైశాచికానందం పోందుతున్నారని కేటీఅర్ మండిపడ్డారు. ఆ సమయంలో తాను అక్కడ లేకున్నా తన పేరుతో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో... ఆ రాత్రి తన తండ్రితో ఎర్రవెల్లిలో ఉన్నట్లు తెలిపారు కేటీఆర్.

అనంతరం ఇంటికి వెళ్లి నిద్రకు ఉపక్రమించినట్లు తెలిపారు. ఉదయం లేచి చూసేసరికి రేవ్ పార్టీ అంటూ పలు వార్తలు వచ్చాయని అన్నారు. ఇలా.. తనపైనా, తన భార్యపైనా, కుటుంబ సభ్యులపైనా ఇష్టం వచ్చినట్లు మీడియాలో ప్రచారం చేయొచ్చా అని ప్రశ్నించారు. ఆ ఫ్యామిలీ కారక్రమంలో తన బావమరిది తల్లి (70) కూడా ఉన్నారని వెల్లడించారు.

ఇలా రెండేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల వయసున్న చిన్న పిల్లలు కూడా ఉన్నారని.. ఈ కుటుంబంలో నిర్వహించిన పార్టీలో కొంతమంది మందు తాగితే తాగి ఉండొచ్చని అన్నారు. అయితే... అక్కడ అందరూ కుటుంబ సభ్యులే ఉండగా.. కొంతమంది పురుషులు, మహిళలు అని అనుమానాలకు తావిచ్చేలా తపుడు ప్రచారం చేస్తున్నారని.. ఆ ఫంక్షన్ లో ఉన్నది భార్యాభర్తలని స్పష్టం చేశారు!