Begin typing your search above and press return to search.

కొండా సురేఖ వ్యాఖ్యలు.. కేటీఆర్ సంచలన నిర్ణయం

ఇక.. కేటీఆర్ కూడా మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలతో తనతోపాటు, తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

By:  Tupaki Desk   |   22 Oct 2024 6:14 AM GMT
కొండా సురేఖ వ్యాఖ్యలు.. కేటీఆర్ సంచలన నిర్ణయం
X

మంత్రి కొండా సురేఖ మాజీమంత్రి కేటీఆర్, సినీనటుడు నాగార్జున మీద చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపింది. అటు రాజకీయంగానూ, ఇటు టాలీవుడ్‌లోనూ మంత్రి వ్యాఖ్యలపై ప్రకంపనలు రేపాయి. ఇంకా ఆ వివాదం సమసిపోనేలేదు. కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. కేసులతో పాటే మంత్రి సురేఖ పరువు నష్టం దావాలను సైతం ఎదుర్కొంటున్నారు. ఫైనల్‌గా తీర్పు ఏం రాబోతోందని అందరిలోనూ ఉత్కంఠ అయితే కనిపిస్తోంది.

కేటీఆర్‌ను టార్గెట్ చేసిన మంత్రి సురేఖ.. ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఏకంగా హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేయించారని, హీరోయిన్లను పలురకాలుగా వేధించారంటూ ఆరోపించారు. అలాగే.. అటు సినీ నటుడు నాగార్జున కుటుంబంపైనా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఇద్దరూ వేర్వేరుగా కోర్టులో పిటిషన్ వేశారు. నాగార్జున క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు పరువునష్టం దావా సైతం వేశారు. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇక.. కేటీఆర్ కూడా మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలతో తనతోపాటు, తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారని నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. కొండా సురేఖ మాట్లాడిన వీడియోలను కోర్టుకు అప్పగించారు. కీలకమైన మరో 23 రకాల ఆధారాలనూ ఆయన సమర్పించారు. అలాగే.. ఈ కేసులో కేటీఆర్ తరఫున సాక్షులుగా బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, ఉమ, శ్రవన్ పేర్లను ఇచ్చారు.

కేటీఆర్ తనపై నిరాధార ఆరోపణలకు చెక్ పెట్టేందుకు సురేఖ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండా సురేఖ అభ్యతకర వ్యాఖ్యలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. కొంత కాలంగా తన క్యారెక్టర్‌ను దిగజార్చేందుకు సోషల్ మీడియాలో చేసే ప్రయత్నాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా తాను వ్యక్తిగత వివాదాల కంటే ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. రాజకీయ విమర్శల పేరుతో ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేసే వారికి ఇది గుణపాఠం కావాలి అని తెలిపారు. వాటన్నింటికీ చెక్ పడాలంటే కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని తెలిపారు. ఎప్పటికైనా కోర్టులో న్యాయం గెలుస్తుందని, తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.