Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ నేతల సంచలన వీడియో ట్వీట్ చేసిన కేటీఆర్

అలాగే.. నరేందర్ రెడ్డి సతీమణి శ్రుతితో కూడా కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

By:  Tupaki Desk   |   13 Nov 2024 9:26 AM GMT
కాంగ్రెస్ నేతల సంచలన వీడియో ట్వీట్ చేసిన కేటీఆర్
X

వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ ప్రతీక్ జైన్‌తోపాటు పలువురు అధికారులపై జరిగిన దాడి వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఈ కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు. నిన్ననే వారికి వైద్య పరీక్షలు చేసి కొడంగల్ కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. ఇక మరో 50 మంది అనుమానితులను పరిగి పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తూనే ఉన్నారు.

అయితే.. ఈ దాడి ఘటనలో సురేశ్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఈయనే గ్రామ ప్రజలను రెచ్చగొట్టి నిన్నటి వివాదానికి కారకుడయ్యాడని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా సురేశ్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. దాడికి ముందు చాలాసార్లు సురేశ్ నరేందర్ రెడ్డితో చాలాసార్లు మాట్లాడారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయాన్నే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారు.

రేవంత్ చేతగాని పాలనకు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టే నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. తన ట్విట్వర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ 16 మంది కొడంగల్ రైతులు జైలులో ఉన్నారని, పాలకులు మాత్రం ఎంజాయిమెంట్‌లో ఉన్నారని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టు కాగా.. మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లండన్‌లో ఉన్నారని, సీఎం మహారాష్ట్రలో ఉన్నారని సెటైర్లు వేశారు. జూపల్లి, కాంగ్రెస్ నేతల వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

అలాగే.. పోలీసుల అదుపులో ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. అక్రమంగా అరెస్టు చేశారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయనకు భరోసా కల్పించారు. ధైర్యంగా పోరాడుదామని తెలిపారు. అలాగే.. నరేందర్ రెడ్డి సతీమణి శ్రుతితో కూడా కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ లీగల్ సెట్ పోరాడుతుందని హామీ ఇచ్చారు.