Begin typing your search above and press return to search.

కేటీయార్ ని సీఎం చేయాలీ అంటే మోడీ పర్మిషన్ కావాలా...?

ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తన పార్టీ వారు ఒప్పుకుంటే చాలు, ఇతర పార్టీల అనుమతి అంగీకారం అసలు అవసరం ఉండదు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 9:38 AM GMT
కేటీయార్ ని సీఎం చేయాలీ అంటే మోడీ పర్మిషన్ కావాలా...?
X

కేటీయార్ బీయారెస్ లీడర్. సీఎం కేసీయార్ తరువాత నంబర్ టూ లో ఉన్న మంత్రి. అటు బీయారెస్ లోనూ ఇటు ప్రభుత్వంలోనూ కూడాకేసీయార్ తరువాత కేటీయార్ అనేట్లుగా ఉంటూ వస్తున్నారు. గత తొమ్మిదేళ్ళుగా ప్రభుత్వంలో పార్టీలో పట్టు సాధించారు. ఇక మరో వైపు చూస్తే బీయారెస్ పక్కా ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీకి దానికంటూ సొంత వ్యక్తిత్వం అస్తిత్వం ఉంది.

బీయారెస్ నిర్ణయాలను కేసీయార్ పార్టీ నేతలతో కూర్చుని తీసుకుంటారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తన పార్టీ వారు ఒప్పుకుంటే చాలు, ఇతర పార్టీల అనుమతి అంగీకారం అసలు అవసరం ఉండదు. మరో వైపు చూస్తే బీజేపీ జాతీయ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉంది.

ఇక తెలంగాణాలో రెండు సార్లు గెలిచిన బీయారెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి కావాలీ అంటే ప్రధాని మోడీ పర్మిషన్ అవసరమా అన్న చర్చ సాగుతోంది. ప్రధాని దేశానికి ఉంటారు. కానీ ఆయన వేరొక రాజకీయ పార్టీల వ్యవహరాంలో జోక్యం చేసుకుని వారి నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఉంటారా అలా ఎక్కడైనా జరుగుతుందా అన్నది ఇక్కడ ఒక చర్చగా ముందుకు వస్తోంది.

మోడీ తలచుకుంటే తన పార్టీ ముఖ్యామంత్రులను క్షణాలలో మార్చగలరు. అదే విధంగా ఏ నాయకుడి నుదుటి గీత అయినా మార్చేసి సీఎం కుర్చీలో కూర్చోబెట్టగలరు. కానీ ఇతర పార్టీల వ్యవహారాలలో అది చెల్లుతుందా. అలా బీజేపీ అనుకుంటోందా అన్నదే ఇక్కడ పాయింట్.

బలమైన ప్రధానిగా మోడీ ఉన్నారు, అలాగే దేశంలో వరసగా రెండు మార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా బీజేపీ ఉంది. అంత మాత్రం చేత ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాలలో మోడీ జోక్యం ఎలా చేసుకోగలుగుతారు. అసలు అలాంటి అధికారాలు ఆశలు ఎలా వస్తాయి అన్నది కూడా ఇపుడు అంతా చర్చిస్తున్నారు

ఇప్పటికే బీజేపీ మీద ఇతర పార్టీల వ్యవహారాలలో తానుగా జోక్యం చేసుకుంటుంది అన్న విమర్శ ఉంది. మహారాష్ట్రలో శివసేనను నిలువునా చీల్చేసి షిండెను తెచ్చి సీఎం ని చేసి తన చెప్పుచేతలలో ఉంచుకుంది. అంతే కాదు మరో వైపు ఎన్సీపీని చీల్చి ఏకంగా సీనియర్ మోస్ట్ లీడర్ అయిన శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ని డిప్యూటీ సీఎం గా చేసి మహా రాజకీయాన్ని బీజేపీ నడుపుతోంది.

ఇక 2018 నుంచి చూసుకున్నా అంతకు ముందు చూసుకున్నా ఇతర పార్టీల అంతర్గత వ్యవహారాలలో బీజేపీ జోక్యం చేసుకోవడం జరుగుతోంది అని ప్రాంతీయ పార్టీలు గట్టిగా విమర్శిస్తున్న నేపధ్యం ఉంది. తన దగ్గరకు వచ్చిన పార్టీలను దీవించడం, లేని పార్టీలలో చిచ్చు పెట్టడం బీజేపీ రాజకీయ విధానంగా మారిందని కూడా ఆరోపణలు ఉన్నాయి.

వాటికి బలం చేకూరేలా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మూడేళ్ళ క్రితం నాటి ముచ్చటను ఆయన భాషలో చెప్పాలంటే ఒక సీక్రెట్ ని బయట పెట్టారు. అపుడెపుడో తెలంగాణా సీఎం కేసీయార్ తన వద్దకు వచ్చి కేటీయార్ ని సీఎం గా చేయడానికి మోడీ మద్దతు కావాలని కోరారని ఆ పాత ముచ్చటను నిజామాబాద్ సభలో చెప్పారు.

మరి మోడీ ఇలా ఎందుకు చెప్పారు, దీని వల్ల ఆయనకు కానీ బీజేపీకి కానీ రాజకీయ లాభం ఏంటి అన్నది కూడా మరో వైపు చర్చ సాగుతోంది. ఒకవేళ కేసీయార్ తన కుమారుడు కేటీయార్ ని సీఎం చేయాలనుకున్నా అందులో తప్పేముంది, అది పొరపాటు కాదు కదా. అందులో సీక్రెట్ ఏముంది అన్న చర్చ కూడా నడుస్తోంది.

అయితే మోడీతో ఆయన తన మనసులో మాటను పంచుకోవడం అన్నది ఇక్కడ పాయింట్ అనుకున్నా మోడీ అనుమతి కావాలా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అదే సభలో మోడీయే చెప్పినట్లుగా ఎవరు సీఎం కావాలన్నా ప్రజల బలం అశీర్వాదం ఉండాలి. మరి ఆ విధంగా చూసుకుంటే తెలంగాణాలో బలంగా ఉన్న బీయారెస్ ప్రజల మద్దతు కోరుతుంది కానీ బీజేపీ మద్దతు ఏమి అవసరం అన్న డౌట్లు కూడా వస్తున్నాయి.

మోడీ ఈ రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా దేశానికి ప్రధాని స్థాయిని తగ్గించుకుని ఒక పార్టీ నేత స్థాయిలో మాట్లాడారు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని మీద దేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజంగా ఈ మాట అనడం ద్వారా మోడీ పప్పులో కాలు వేశారనే అంటున్నారు. ఆయన ఇలా చెప్పడం ద్వారా బీజేపీ అవకాశాలు ఎంతో కొంత దెబ్బ తీశారు అని అంటున్నారు.

అదెలా అంటే బీయారెస్ బీజేపీ ఒక్కటి అన్న ప్రచారాన్ని కాంగ్రెస్ చేస్తోంది. ఇపుడు మోడీ సీక్రెట్ అంటూ ఈ విషయం చెప్పగానే కాంగ్రెస్ వెంటనే రియాక్ట్ అయి అవును ఆ రెండు పార్టీలు ఒక్కటే అని ప్రచారం చేయడానికి ఆస్కారం ఏర్పడింది. అదే సమయంలో బీజేపీ తెలంగాణాలో ఏ మాత్రం పుంజుకోవడంలేదు, ఇపుడు ఈ రకమైన కామెంట్స్ వల్ల కాంగ్రెస్ కే బలం చేకూర్చారు అని అంటున్నారు.

ఎటూ బీయారెస్ అధికారంలో ఉంది. ఆ పార్టీకి కేసీయార్ తరువాత కేటీయార్ సీఎం అన్నది జనాలకు కూడా ఒక అవగాహన ఉంది. అయితే బీయారెస్ ని గెలిపించేది జనాలు. ఇపుడు సీక్రెట్ అని మోడీ చెప్పి బీజేపీనే ఇబ్బందుల పాలు చేశారు తప్ప బీయారెస్ కి పోయిందేముంది అన్నదే చర్చగా ఉంది. పైగా ఇతర పార్టీలు మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల రాజకీయాల్లో బీజేపీ దూరుతోందన్న మాటకు కూడా అవకాశం ఇచ్చేలా మోడీ మాటలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా మోడీ ప్రకటన బీజేపీకి జోష్ ఇవ్వకపోగా ఎందుకు ఇలా పెద్దాయన అన్నారూ అన్న చర్చ కూడా ఆ పాటీలో సాగుతోంది అంటున్నారు.