రేవంత్ కి కీలక బాధ్యత అప్పగించిన కేటీఆర్!
ఈ క్రమంలో కొత్త ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీఆరెస్స్ నేతలు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 13 Dec 2023 12:30 PM GMTతెలంగాణలో సుమారు దశాబ్ధ కాలం తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొందర్లో కూలిపోద్దని.. త్వరలో కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని బీఆరెస్స్, బీజేపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ విషయాలపై కాంగ్రెస్ పార్టీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఆ సంగతి అలా ఉంటే... పాలన విషయంలో కాంగ్రెస్ కు కేటీఆర్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా వ్యాఖ్యానిస్తూ.. ఇప్పుడు మొదలైంది అసలు ఆట అనే కామెంట్లు చేశారు.
అవును... కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక నిన్నటి వరకు కాస్త కాం గా ఉన్నట్లు కనిపించిన తెలంగాణ రాజకీయం ఉన్నఫలంగా వేడెక్కుతోంది. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీఆరెస్స్ నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆరెస్స్ ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారని, అసలు ఆట ఇప్పుడు మొదలయ్యిందని అన్నారు.
ఈ వ్యాఖ్యలతో పాటు హైదరాబాద్ విషయంలో ఒక కీలక ట్వీట్ చేశారు కేటీఅర్. ఇందులో భాగంగా... మెర్సర్ కంపెనీ ప్రకటించిన క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాకింగ్స్ ని ప్రస్థావించారు. తాజాగా ఈ సంస్థ వెల్లడించిన "క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాకింగ్స్- 2023" హైదరాబాద్ తొలి స్థానంలో నిలిచింది. సరిగ్గా ఈ విషయంపై కేటీఆర్ స్పందించారు. ఇది ఇప్పటివరకూ జరిగిన తమ పాలనకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇందులో భాగంగా... హైదరాబాద్ వాసిగా గర్వప గర్వపడుతున్నాను అని మొదలుపెట్టిన కేటీఆర్... గత తొమ్మిదేళ్లలో ఆరు సార్లు హైదరాబాద్ ను మెర్సర్స్ చార్ట్ లో అగ్రస్థానంలో ఉండేలా చూసుకున్నామని అన్నారు. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం దానిని తదుపరి స్థాయికి తీసుకెళ్లాలని ట్వీట్ చేశారు. దీంతో హైదరాబాద్ విషయంలో రేవంత్ సర్కార్ కి కేటీఆర్ కీలక టాక్స్ ఇచ్చినట్లేననే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఇదే సమయంలో... శాసనసభ ఆవరణలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కేటీఆర్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా... రేవంత్ రెడ్డి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని.. ఆయన చెప్పిన ప్రతీ మాటకు రికార్డ్ ఉందని.. అలాంటప్పుడు తామెందుకు వదిలిపెడతామని అన్నారు. ఇదే సమయంలో... అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు.
ఇదే సమయంలో అధికారంలోకి రాగానే పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని.. పదిరోజులు ఆగండి 15వేలు రైతు భరోసా ఇస్తాం అని తెలిపారని.. అయితే ఇప్పటి వరకు ఏవీ ఇవ్వలేదని కేటీఅర్ దుబ్బయట్టారు. తమ ప్రభుత్వం చేసిన ప్రతీ రిపోర్ట్ కూ ఆడిట్ రిపోర్ట్ ఉందని.. ప్రతి ఏటాది పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని.. అసలు ఆట ఇప్పుడే మొదలయిందని అన్నారు. దీంతో.. రేపటి నుంచి ప్రారంభం కాబోయే అసెంబ్లీ సెషన్స్ వాడీ వేడీగా సాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది.