జగన్ కి మద్దతుగా కేటీఆర్ వ్యాఖ్యలు ...!
తెలంగాణా అగ్ర నేత బీఆర్ ఎస్ కీలక నాయకుడు అయిన కేటీఆర్ ఏపీ సీఎం జగన్ కి మద్దతు ఇచ్చారు.
By: Tupaki Desk | 8 Jan 2024 12:30 AM GMTతెలంగాణా అగ్ర నేత బీఆర్ ఎస్ కీలక నాయకుడు అయిన కేటీఆర్ ఏపీ సీఎం జగన్ కి మద్దతు ఇచ్చారు. ఏపీలో జగన్ చేస్తున్న అభ్యర్ధుల మార్పు చేర్పుల విషయంలో ఆయన పరోక్షంగా ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్లు అయింది. కేటీయార్ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చి ఉంటే రిజల్ట్ వేరేగా ఉండేదన్నది బలమైన అభిప్రాయంగా ఉందని కేటీయార్ ఈ మీటింగులో చెప్పడం విశేషం. అలా కనుక చేసి ఉంటే ఫలితాలు వేరేగా వచ్చేవని ఆయన అనడం విశేషం. అయితే పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని కేటీఆర్ అనడం గమనార్హం.
దీనిని బట్టి చూస్తే సిట్టింగ్ అభ్యర్ధుల పట్ల ఉన్న వ్యతిరేకత వల్లనే బీఆర్ఎస్ ఓడింది అని కేటీఆర్ కన్ ఫర్మ్ గా చెప్పేశారు అని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ చేసిన తప్పును ఏపీలో మాత్రం జగన్ చేయడం లేదు అన్నది గుర్తు చేస్తున్నారు. జగన్ ఎందుకు చాలా మందిని మార్చేస్తున్నారు అన్న ప్రశ్న కూడా ఉంది.
అభ్యర్ధులను మార్చేస్తేనే విజయం సాధిస్తారా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే జగన్ మాత్రం ఏకంగా యాభై నుంచి అరవై మంది దాకా సిట్టింగులను మార్చడమో లేక పక్కన పెట్టడమో లేక షఫలింగ్ చేయడమో చేస్తున్నారు. ఇది చాలా పెద్ద కసరత్తుగా సాగుతోంది. దీని మీద సొంత పార్టీ నేతలతో పాటు బయట పార్టీల నుంచి కూడా చర్చ ఉంది.
అయితే ఎమ్మెల్యేలు ప్రజలకు ఎదురుగా కనిపిస్తారు. వారిలో పనితీరు బాగులేని వారిని మళ్ళీ ముందు పెట్టి ఓట్లు అడిగినా జనాలు మాత్రం ముఖం తిప్పుకుంటారు. అదే కొత్త వారికి చాన్స్ ఇస్తే ఆ ఫ్రెష్ లుక్ తో జనాలు టర్న్ అయ్యే చాన్స్ ఉంది. పైగా ఈయన ఎలా చేస్తారో అన్న ఉత్కంఠ ఉత్సాహం కూడా ఉంటుంది.
గతంలో అయితే ఒక ఎమ్మెల్యే చాలా సార్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇపుడు అలా లేదు. ప్రజలు ఎప్పటికపుడు వెరైటీ కోరుకుంటున్నారు. పార్టీల అధినేతల విషయంలో అది సాధ్యపడకపోయినా లోకల్ గా నియోజకవర్గ స్థాయిలో మార్పు చేర్పులు ఉంటే ప్రజలకు కూడా ఒక చాయిస్ ఉంటుంది అన్న ఆలోచనలు బయల్దేరాయి. దాంతోనే సిట్టింగుల మీద ఒక్క టెర్మ్ కే వ్యతిరేకత వస్తోంది.
దాంతో అధినాయకత్వం కూడా ప్రజాభిప్రాయం ప్రకారం నడచుకోవాల్సి వస్తోంది. చాలా మంది డేరింగ్ స్టెప్ తీసుకోవడానికి జంకుతారు. కానీ వైసీపీ అధినాయకత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా ముందుకు సాగుతోంది. దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయని నమ్ముతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.