Begin typing your search above and press return to search.

మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది.. కేటీఆర్ సంచలన కామెంట్లు!

ప్రభుత్వాన్ని కూల్చాలని కేటీఆర్, కేసీఆర్ భావిస్తున్నారు కాబోలు అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం గట్టిగా ఉందని అందరం రేవంత్ నాయకత్వానికి పచ్చ జెండా ఊపినట్లు వారు పేర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 12:29 PM GMT
మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది.. కేటీఆర్ సంచలన కామెంట్లు!
X

భారీ మెజారిటీతో కాకపోయినా మ్యాజిక్ ఫిగర్ ను దాటి సీట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని సర్వేలు చెప్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యలో ప్రధాన బీఆర్ఎస్ పార్టీ సర్వేలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీనే తమకు అనుకూలంగా సర్వేలు చేయించుకుంటుందని ఆరోపణలు చేస్తూ వచ్చింది.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఊహించని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం 64 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చులకనగా చూసే కేటీఆర్ తమ కార్యకర్తలు, నాయకుల వద్ద ఇష్టా రీతిన మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ మండిపడుతుంది. ఇటీవల ఆయన కార్యకర్తలతో ఇష్టాగోష్టీలో మాట్లాడుతూ కొత్తగా ఏర్పాడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని, కేవలం మూడు నెల్లలోనే వారు అట్టర్ ప్లాప్ అవుతారని, ఈ విషయాన్ని తమ నాయకుల కేసీఆర్ చెప్పినట్లు ముఖ్య కార్యకర్తలకు వివరించాడు.

కేటీఆర్ వ్యాఖ్యలపై గుర్రుమన్న కాంగ్రెస్

బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని అందుకే కాంగ్రెస్ కు భారీ మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చాలని కేటీఆర్, కేసీఆర్ భావిస్తున్నారు కాబోలు అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం గట్టిగా ఉందని అందరం రేవంత్ నాయకత్వానికి పచ్చ జెండా ఊపినట్లు వారు పేర్కొంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రజల్లో మరింత దిగజారుతారని అంటున్నారు. మీ ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటే మీకే మెజారిటీ ఇచ్చేవారు అన్న కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ ను దాటాలంటే ఒకటి, రెండు సీట్లు కాదని 20కి పైగా సీట్లు కావాలని బీజేపీ, ఎంఐఎం కాలిసి వచ్చినా 15 సీట్లు మాత్రమే అవుతాయని

ఎలా ప్రభుత్వం కూలుతుందని కలలు కంటున్నారని కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి మరింత గొప్ప పాలన అందిస్తామని వారు అంటున్నారు. ఏది ఏమైనా కేటీఆర్ వ్యాఖ్యలపై ఇటు కాంగ్రెస్ నాయకులతో పాటు ప్రజల్లో కూడా అసహనం నెలకొంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.