ఆ చెత్త నా కొడుకుల్ని అడగాలె.. ఏందిది కేటీఆర్?
తీవ్రమైన ఇరిటేషన్ కు గురవుతున్నారు మంత్రి కేటీఆర్. ఎప్పుడూ లేని రీతిలో బ్యాలెన్స్ మిస్ అవుతున్న ఆయన మాటలు ఇప్పుడు షాకింగ్ గా ఉంటున్నాయి.
By: Tupaki Desk | 22 Nov 2023 5:30 AM GMTతీవ్రమైన ఇరిటేషన్ కు గురవుతున్నారు మంత్రి కేటీఆర్. ఎప్పుడూ లేని రీతిలో బ్యాలెన్స్ మిస్ అవుతున్న ఆయన మాటలు ఇప్పుడు షాకింగ్ గా ఉంటున్నాయి. చిన్న విషయాలకే ట్రిగ్గర్ అవుతున్నారు. ఎన్నికల్లో గెలుపు చాలా సులువు అని ఓవైపు చెబుతూనే.. చెమటోడుస్తున్న ఆయన మాటల్లో సహనం మిస్ అవుతోంది. తమ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించినంతనే తిట్ల దండకం అందుకుంటున్నారు. ఎన్నికల వేళ మాటల్లో మిస్ కాకుండా ఉండాల్సిన వినయ విధేయతలు పూర్తిగా పోయి.. కొత్త తరహా కేటీఆర్ ను చూడాల్సి రావటంపై విస్మయం వ్యక్తమవుతోంది.
ఉన్నత చదువులు చదివి.. మర్యాదస్తుడిగా పేరున్న కేటీఆర్ లాంటి నేత నోటి నుంచి.. ‘‘ఈ సన్నాసులు.. ఆ చెత్త నా కొడుకుల్ని అడగాలె.. ’ అంటూ తిట్ల దండకాన్ని అందుకోవటమే కాదు.. తాను ప్రసంగిస్తున్న వేదికకు ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకెక్కి ప్లకార్డుల్ని ప్రదర్శిస్తున్న యువకులు పట్టుకునేందుకు పోలీసులు వెళ్లిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారంగా మారాయి. ప్లకార్డుల్ని ప్రదర్శించినోళ్లకు పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల్ని చూసి పారిపోయిన యువకులను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్.. ‘‘ఏడబోయిండ్రువాళ్లు. పారిపోయిండ్రా? ఇగో ఇట్లనే ఎవడన్న అడిగితే వలిగొండలో వీపు పగలకొట్టి గుంజేయాలె. అర్థమైందా?’’ అంటూ మాట్లాడిన కేటీఆర్ తీరు షాకింగ్ గా మారింది.
ఇంతకూ ఇదంతా ఎక్కడ జరిగిందన్న విషయంలోకి వెళితే.. యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండలో నిర్వహించిన రోడ్ షో సందర్భంగా మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఆణిముత్యాల్లాంటి వ్యాఖ్యలు వచ్చాయి. పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న వేళ.. ప్రశ్నించే తీరును అస్సలు సహించలేనట్లుగా మారిన ఈ వైఖరి ఇప్పుడుహాట్ టాపిక్ గా మారింది. తన రోడ్ సందర్భంగా తాను ప్రసంగిస్తున్న వేదికకు ఎదురుగా ఉన్న భవనం మీదకు చేరిన కొందరు యువకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు.. నినాదాలు చేసిన వేళలో.. బ్యాలెన్స్ మిస్ అయ్యారు కేటీఆర్.
‘‘వందల పథకాలు తెచ్చిన కేసీఆర్ ను గెలిపించుకుందామా? ఓటుకు నోటు దొంగల్ని గెలిపించుకుందామా?’’ అంటూ వ్యాఖ్యానించిన కేటీఆర్ ను ఉద్దేశించి కొందరు యువకులు.. ఇంటికో ఉద్యోగం ఎక్కడ? కేజీ టు పీజీ ఏమైంది? ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఎక్కడ? లాంటి ప్రశ్నలతో ఉన్న ప్లకార్డుల్నిప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో స్పందించిన కేటీఆర్ మాటల్ని ఆయన మాటల్లోనే చెప్పాలి. అప్పుడు ఆయన తీరు ఎలా ఉందన్నది ఇట్టే అర్థమవుతుంది.
‘‘ఆ సన్నాసులు అడుగుతున్నారు.. డిగ్రీ కళాశాల ఎక్కడని? 55 ఏండు పాలించిన కాంగ్రెస్ చెత్తనా కొడుకులను అడగండి. అడగడానికి ఇజ్జత్, మానం లేదు. 55 ఏండ్లు పాలించిన చెత్తనాకొడుకులు ఇక్కడికి వచ్చి ఇది లేకపాయె, అది లేకపాయె అని అంటున్నరు. వీపు పగలకొట్టేవారు లేకనా? ఈ 55 ఏండ్లలో యాదాద్రిని జిల్లా చేయాలన్న ఆలోచన రాలేదీ కొడుకులకు. కరెంట్ ఇచ్చిండ్రా? సాగు, తాగు నీరు ఇచ్చిండ్రా? డిగ్రీ కాలేజీ.. కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రా? ఈ కొడుకులు” అంటూ ఫైర్ అయ్యారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులకు చిక్కుకండా వెళ్లిపోయిన యువకుల్ని ఉద్దేశిస్తూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.
‘‘ఏడబోయిండ్రు వాళ్లు. పారిపోయిండ్రా? ఇగో ఇట్లనే ఎవడన్న అడిగితే వలిగొండలో వీపు పగలకొట్టి గుంజేయాలె.. అర్థమైందా? 30 తారీఖు నాడు ఎవ్వడు అడ్డమొచ్చినా.. తొక్కుకుంటా పోవుడే. శేఖర్రెడ్డిని గెలిపించుడే. ఈ తెగుతవతోనే.. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకోవాలె” అంటూ చేసిన కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. ఎంతగా ఇరిటేట్ చేస్తే మాత్రం మరీ ఇంతలా తీవ్రంగా రియాక్టు కావాల్సిన అవసరం ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది.