Begin typing your search above and press return to search.

కేఏ పాల్ స్థానాన్ని భర్తీచేస్తున్న కోమటిరెడ్డి

టిమ్స్ ఆసుపత్రిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

By:  Tupaki Desk   |   25 May 2024 1:30 PM GMT
కేఏ పాల్ స్థానాన్ని భర్తీచేస్తున్న కోమటిరెడ్డి
X

ఇదివరకు అందరూ కేఏ పాల్‌ మీద జోకులు వేసేవారు. కానీ త్వరలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీద జోకులు వేసే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. టిమ్స్ ఆసుపత్రిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.

ఒక మంత్రి హోదాలో ఉంటూ పదే పదే కరెంట్ పోతుందని మాట్లాడుతున్నాడు. ఆయన జోకరా ? మంత్రా ? ఈ ప్రభుత్వాన్ని ఎంత మూర్ఖులు, ఎంత సన్నాసులు, ఎంత జోకర్లు నడుపుతున్నారో అర్దమవుతుందని కేటీఆర్ మండిపడ్డారు.

కరెంట్ పోతే 14వ అంతస్తు నుంచి 27వ అంతస్తుకు ఎలా పోతారు? అని కోమటిరెడ్డి అంటున్నాడు. మరి 14 అంతస్తులే కడితే 3వ అంతస్తులో ఉన్నప్పుడు కరెంట్ పోతే 14వ అంతస్తుకు ఎలా వెళతారు అని కేటీఆర్ ప్రశ్నించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కరెంట్ పోతే జనరేటర్ ఉండదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది. బ్రూ ట్యాక్స్ అంటే B - భట్టి, R - రేవంత్, U - ఉత్తమ్ అని, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది కాబట్టి ఇక ఎవరి దుకాణం వారే తెరుస్తారని కేటీఆర్ ఆరోపించారు. ఈ కొత్త ట్యాక్సుల మూలంగా నిర్మాణరంగం, పరిశ్రమలు కుదేలవుతాయని అన్నారు.