Begin typing your search above and press return to search.

రాజకీయ కుట్రతోనే రాజముద్ర మార్పు

తెలంగాణ అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది హైద‌రాబాద్‌, చార్మినార్, వరంగల్, కాకతీయ కళాతోరణం.

By:  Tupaki Desk   |   30 May 2024 9:56 AM GMT
రాజకీయ కుట్రతోనే రాజముద్ర మార్పు
X

తెలంగాణ అన‌గానే మొద‌ట గుర్తొచ్చేది హైద‌రాబాద్‌, చార్మినార్, వరంగల్, కాకతీయ కళాతోరణం.

రాజ‌కీయ కుట్ర‌తోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగా తెలంగాణ రాజ‌ముద్ర‌ను మార్పు చేయాల‌ని నిర్ణ‌యించింది’ అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారిక ముద్ర మార్పును నిర‌సిస్తూ బీఆర్ఎస్ నేత‌ల‌తో క‌లిసి చార్మినార్ వ‌ద్ద ఆయన ధ‌ర్నా చేశారు.

నాడు ఎన్టీఆర్ కాక‌తీయ క‌ళాతోర‌ణం ప్రతిమను ట్యాంక్‌బండ్‌కు ఇరువైపులా పెట్టార‌న్న విషయం కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన‌లేద‌ు. కేసీఆర్ పెట్టిన గుర్తులు మార్చాల‌ని చూస్తున్నాడు అంటూ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాల‌ను నిల‌బెట్టుకోకుండా గ‌త ప‌దేళ్ల‌లో చేసిన ప్ర‌గ‌తిని క‌నిపించ‌కుండా చేసేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ప్రయత్నిస్తుందని, ఇలాంటి ప‌నికిమాలిన చ‌ర్య‌ల‌కు దిగ‌డం స‌రికాద‌ని కేటీఆర్ అన్నారు.

అసలు సీఎం రేవంత్‌కు రాజ‌ముద్ర‌ను మార్చాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. గత పదేళ్లలో ప్రభుత్వంలో మంచి జరిగితే దాని గురించి ప్రజలకు చెప్పాలి. గత పదేళ్లలో జరిగిన మంచిని, అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక రాజకీయ దుగ్ద, కక్షతో రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని అన్నారు.

పదేళ్లలో ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరగాలి. చార్మినార్ ను తొలగించటమంటే ప్రతి హైదరాబాదీని అవమానపర్చినట్టే. ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టే. మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చామని, మేలు చేయమని, పథకాలు అమలుచేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలు, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ అన్నారు.