పేగులు మెల్లో వేసుకోవడానికి తానేమైనా బోటీ కొడతాడా?
కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచిస్తున్నారు.
By: Tupaki Desk | 26 March 2024 12:37 PM GMTదేశంలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీల్లో విమర్శలు పెరుగుతున్నాయి. ఒక పార్టీపై మరో పార్టీ వ్యంగ్యాస్త్రాలు విసరడం మామూలే. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. లోక్ సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని జోస్యం చెప్పారు. ఈ మాట పలు సందర్భాల్లో అన్నా రేవంత్ రెడ్డి కనీసం కౌంటర్ కూడా వేయడం లేదు. అంటే తాను చెప్పినట్లు రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీలో చేరడం ఖాయమనే వాదన వినిపించడం గమనార్హం.
సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఇసుక దందాతో పాటు రైస్ మిల్లర్లు, బిల్డర్లను బెదిరించి పార్లమెంట్ ఎన్నికల కోసం రూ. 2500 కోట్లు వసూలు చేశారని కొత్త పల్లవి అందుకున్నారు. వాటి నుంచి తప్పించుకునేందుకు ఫోన్ ట్యాపింగ్ లు, గొర్ల కుంభకోణం, బర్ల స్కామ్ అంటూ ఏవేవో వాదనలు వినిపిస్తున్నారు. దీంతో వాటి నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
ముఖ్యమంత్రి పేగులు మెడలో వేసుకుంటారట. అంటే బోటి కొట్టేవాడు ముఖ్యమంత్రా? ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చుకుంటున్నారు. జేబులో కత్తెర పెట్టుకుని తిరిగేది దొంగలే కదా అని తనదైన శైలిలో విమర్శలు చేశారు. లంకె బిందెల కోసం తిరిగేవారు అత్యాశపరులు. రాత్రి పూట గుప్త నిధుల కోసం దొంగతనంగా తవ్వుకునే వారు. అలాంటి ముఖ్యమంత్రికి లంకె బిందెలు ఎక్కడ దొరుకుతాయో ఆయనకే తెలుసని అన్నారు.
లోక్ సభ ఎన్నికల తరువాత రేవంత్ రెడ్డి తన వర్గంతో బీజేపీలో చేరతారని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని తిడతారు. రేవంత్ రెడ్డి మాత్రం మోదీని పెద్దన్నగా చెబుతున్నారు. ఇందులో ఎవరిది నిజం. ప్రధాని అదానీ ఇద్దరు దొంగలని రాహుల్ పేర్కొంటారు. రేవంత్ రెడ్డి మాత్రం మోదీ, అదానీ దేశానికి కావాల్సిన నేతలే అంటారు. ఇలా ఎవరికి వారే తమ అభిప్రాయాలు చెబుతున్నారు. కానీ ఇందులో ఎవరి మాటలు విశ్వసించాలి అని కేటీఆర్ విమర్శనాస్త్రాలు చేశారు.
కేటీఆర్ తనదైన శైలిలో విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్ గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ఆలోచిస్తున్నారు. పార్టీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకునేందుకు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి సీఎం వల్ల తిప్పలు తప్ప పనులు జరగవని అభిప్రాయం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.