నిన్న చెల్లి.. నేడు అమ్మ.. వహ్వా కేటీఆర్ సాబ్!!
ముఖ్యంగా తన కుటుంబంలోని మహిళలను ఆయన ప్రచారంలో ఎక్కువగా వాడేస్తున్నారు.
By: Tupaki Desk | 20 Nov 2023 2:28 PM GMTఎన్నికలు అనగానే ఎక్కడెక్కడి సంగతులో నాయకులకు యాదికొస్తాయి. ప్రచారం అనగానే అవన్నీ గుండుగుత్తుగా మాటల వరదలా మారిపోతాయి కూడా! ఇప్పుడు అచ్చంగా మంత్రి కేటీఆర్ నోటి వెంట కూడా ఇలానే గత కాలపు సంగతులు.. దొంతర లు దొంతరలుగా మైకుల ముందు పేలుతున్నాయి. ముఖ్యంగా తన కుటుంబంలోని మహిళలను ఆయన ప్రచారంలో ఎక్కువగా వాడేస్తున్నారు. రెండు రోజుల కిందట కేటీఆర్ తన చెల్లి, ఎమ్మెల్సీ కవితను ఆకాశానికి ఎత్తేశారు. "మా చెల్లి చాలా ధైర్యవంతురా లు. ఆమె ధైర్యంలో సగం కూడా నాకులేదు. అలాంటి నాయకురాలు రాష్ట్రంలో ఉన్నందుకు గర్విస్తున్నా" అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు జోరుగా వైరల్ అయ్యాయి.
ఇక, తాజాగా తన తల్లి శోభ గురించి కూడా కేటీఆర్ గొప్పలు చెప్పుకొచ్చారు. తమ తల్లి నుంచి తాము ఎంతో నేర్చుకున్నామ న్నారు. ఆమెలో ఉన్న ఓర్పు, సహనం, కుటుంబాన్ని నడిపించే తీరువంటివి తమకు ఎంతో నేర్పాయని కేటీఆర్ వ్యాఖ్యానించా రు. ఇక, ఇదేసమయంలో తన సతీమణి గురించి కూడా పొగడ్తల వర్షం కురిపించారు. ఆమెకు కూడా ఓర్పు ఎక్కువని, చాలా ఆలోచన చేస్తుందని వ్యాఖ్యానించారు. మొత్తంగా.. కుటుంబంలోని మహిళల గురించి కేటీఆర్ ఇప్పుడు చర్చావేదికలపై సుదీర్ఘం గా పొగడ్తలతో ముంచేయడం గమనార్హం.
మొత్తంగా ఈ పరిణామాలను గమనిస్తున్నవారు 'వహ్వా కేటీఆర్ సాబ్'.. అని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ అసెం బ్లీ ఎన్నికలు జరుగుతుండడం.. రాష్ట్రంలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉండడం.. వారి దయ ఉంటే తప్ప. సర్కారు ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్ ఇలా మహిళా జపం చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తు న్నాయి. మొత్తంగా చూస్తే.. ఎన్నికల సమయంలో ఎవరు ఎలా ఉపయోగపడతారో చెప్పడం కష్టం కాబట్టి.. అందరినీ ఆకర్షించేప్రయత్నం చేయడం తప్పు కదా! అందుకే కేటీఆర్ ఇలా మహిళల ఓటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.